ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వారి జీవన ప్రమాణాలు దిగజారిపోవడం ఒకటి అయితే.. కేంద్రం వాటికి సపోర్ట్ చేస్తూ.. రాష్ట్రాన్ని మరింతగా అధః పాతాళానికి తొక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయాలన్నీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రజల్లో ఆవేదన గూడుకట్టుకుంటూనే ఉంది. ప్రజా ఆవేదన చూసి.. ఆవేశంతో ఊగిపోయే పవన్ కల్యాణ్ ఇప్పుడు కంట్రోల్ కంట్రోల్ అనుకుంటున్నారు. దీనికి కారణం.. ఆయన బీజేపీతో పొత్తులో ఉండటమే.
Also Read: కార్పొరేట్లకు మోడీ దోచిపెట్టిన సొమ్ము ఎంతో తెలుసా?
దీంతో ఇప్పుడు మిత్రపక్షాన్ని విమర్శించలేక.. వారి నిర్ణయాలను ఖండించలేక పవన్ కల్యాణ్ నోరు తెరవకుండా సైలెంట్ అయిపోయారు. దీంతో ఆయన నిస్సహాయుడన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోతోంది. ఇది నిఖార్సుగా బీజేపీ వేస్తున్న ముద్ర. ఆయన ప్రజల కోసం ఏమీ చేయరని.. ధైర్యం లేదన్న ముద్రను బీజేపీ వ్యూహాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడు హడావుడిగా పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని ఆ మేరకు షరతు పెట్టి మరీ పొత్తు పెట్టుకున్నట్లుగా పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు చెప్పారు. కానీ.. ఆ తర్వాత రాజధాని రైతులకు మద్దతే కరవైంది.
పవన్‌ను అటు బీజేపీ వారు పట్టించుకోలేదు. ఇటు జనసేన నేతలు కూడా పట్టించుకోలేదు. విష్ణువర్ధన్ రెడ్డిలాంటి బీజేపీ నేతలు రాజధాని రైతులపై దారుణమైన వ్యాఖ్యలు చేసినా జనసేన నేతలు పట్టించుకోలేదు. పవన్ కల్యాణ్ ఖండించలేదు. చివరికి.. రైతులకు సంఘీభావం చెప్పడం కూడా గగనమైపోయింది. అప్పుడప్పుడు ప్రెస్‌నోట్లు మాత్రం రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు కదా.. నిర్ణయం తీసుకున్నాక చూద్దామని ఇటీవల ఓ సందర్భంలో వ్యాఖ్యానించడం కూడా విశేషం.
Also Read: తెలంగాణ ఉద్యోగులకు 29 శాతం ఫిట్‌మెంట్.. కేసీఆర్ వ్యూహం ఏంటి..?
దీంతో రాజధాని రైతులు ఉసూరుమన్నారు. ఇదంతా బీజేపీతో పొత్తు వల్లే జరిగింది. బీజేపీతో పొత్తు లేకపోతే.. స్వేచ్ఛగా ఆయన రాజధాని రైతులకు మద్దతు ప్రకటించేవారు. కానీ.. బీజేపీతో పొత్తువల్ల ఆయన తన ఈమేజీని తగ్గించుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ ఆవేశపడ్డారు. కానీ.. ఇప్పుడు..కార్మికుల ఉద్యమానికి కూడా మద్దతు తెలపలేని దుస్థితిలో ఉన్నారు. బంద్ పాటిస్తే.. ఒక్కసారి కూడా పిలుపు ఇవ్వలేదు. పైగా.. ఒక్క స్టీల్ ప్లాంట్ అమ్మడం లేదని.. దేశం మొత్తం అమ్ముతున్నారన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీంతో పవన్ కల్యాణ్ పూర్తిగా బీజేపీ మాయలో ఉన్నారని.. ఆయన నమ్మదగ్గ నేత కాదన్న ముద్ర ప్రజల్లో వచ్చింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్