https://oktelugu.com/

మారటోరియంలోనూ లోన్లు కట్టారా..! : మీకో శుభవార్త

కరోనా కారణంగా ఎంతో మంది జాబ్స్‌ కోల్పోయారు. చాలా కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయి. ఉపాధి లేకుండా పోయింది. దీంతో ఫైనాన్షియల్‌ ప్రాబ్లం రాకుండా పరిస్థితుల నుంచి కొంత రిలీఫ్ ఇస్తూ గత మార్చిలో ఆర్‌‌బీఐ ఓ ప్రకటన చేసింది. ఆరు నెలల పాటు ఈఎంఐలకు మారటోరియం ఇచ్చింది. దీని ప్రకారం.. బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న వారు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. చాలా మంది కోవిడ్ 19 ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈఎంఐ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 4, 2020 / 02:29 PM IST
    Follow us on

    కరోనా కారణంగా ఎంతో మంది జాబ్స్‌ కోల్పోయారు. చాలా కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయి. ఉపాధి లేకుండా పోయింది. దీంతో ఫైనాన్షియల్‌ ప్రాబ్లం రాకుండా పరిస్థితుల నుంచి కొంత రిలీఫ్ ఇస్తూ గత మార్చిలో ఆర్‌‌బీఐ ఓ ప్రకటన చేసింది. ఆరు నెలల పాటు ఈఎంఐలకు మారటోరియం ఇచ్చింది. దీని ప్రకారం.. బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న వారు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. చాలా మంది కోవిడ్ 19 ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈఎంఐ కట్టకుండా ఉన్నారు.

    Also Read: ‘అటల్ టన్నెల్’ తో దేశానికి ఏం ఉపయోగం?

    బ్యాంకులు మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న వారిపై వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తున్నాయి. దీంతో ఈఎంఐ మారటోరియం అంశం సుప్రీం కోర్టు వరకు చేరింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చింది. వడ్డీపై వడ్డీ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు అక్టోబర్ 5న ఈ అంశంపై వాదనలు విననుంది. ఇక్కడ లోన్ మారటోరియం బెనిఫిట్ పొందిన వారికి వడ్డీ భారం పడకపోవచ్చు.

    అయితే.. మారటోరియం వినియోగించుకున్న వారికి ఈ వెసులుబాటు లభిస్తుండగా.. మరి మారటోరియం వినియోగించుకోకుండా రెగ్యులర్‌‌గా ఈఎంఐలు పే చేసిన వారి సంగతేంటి అనేది ఇప్పుడు అంతటా వినిపిస్తున్న ప్రశ్న. వీరికి కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలో ఊరట కలిగించే కబురు అందించనున్నట్లు తెలుస్తోంది. లోన్ ఈఎంఐ ప్రతినెలా కచ్చితంగా చెల్లించే కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. రూ.2 కోట్ల వరకు రుణాలకు ఇది వర్తిస్తుంది. లోన్ మారటోరియం బెనిఫిట్ పొందిన వారికి వడ్డీ భారం సౌకర్యం కల్పించినప్పుడు సక్రమంగా ఈఎంఐ చెల్లించే వారిని అలాగే వదిలేయడం సమంజసం కాదని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. అందుకని ప్రభుత్వం వీరికి కూడా ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకోచ్చని తెలిపారు.

    Also Read: ట్రంప్ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ.!

    త్వరలో సుప్రీంకోర్టుల ఈఎంఐల వడ్డీ మీద నిర్ణయం ప్రకటించనుంది. ఈ తీర్పు తదుపరి రెగ్యులర్‌‌ వారి కోసం కూడా ఏదో ఒక ఆఫర్‌‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా కేంద్ర ప్రభుత్వం తాజా వడ్డీ మినహాయింపు నిర్ణయంతో రూ.5 వేల నుంచి రూ.7 వేల కోట్ల వరకు భారం పడొచ్చు.