యాదాద్రిలో అర్జిత సేవలు ప్రారంభం..

తెలంగానలో ప్రముఖ దేవాలయం యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి సన్నిధిలో అర్జిత సేవలు ఆదివారం ప్రారభమయ్యాయి. నేటి నుంచి అభిషేకం, సుహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన పూజలు, నిత్య కల్యాణం చేసుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా తలనీలాలు సమర్పించేందుకు కల్యాణ కట్టను సైతం తెరిచినట్లు తెలిపారు. కరోనా కారణంగా మార్చి 22న ఆలయంలో అర్జిత సేవలు నిలిచాయి. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండడంతో ఆలయంలో సేవలను పున: ప్రారంభిస్తున్నట్లు ఆలయ అధికారులు […]

Written By: NARESH, Updated On : October 4, 2020 2:25 pm
Follow us on

తెలంగానలో ప్రముఖ దేవాలయం యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి సన్నిధిలో అర్జిత సేవలు ఆదివారం ప్రారభమయ్యాయి. నేటి నుంచి అభిషేకం, సుహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన పూజలు, నిత్య కల్యాణం చేసుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా తలనీలాలు సమర్పించేందుకు కల్యాణ కట్టను సైతం తెరిచినట్లు తెలిపారు. కరోనా కారణంగా మార్చి 22న ఆలయంలో అర్జిత సేవలు నిలిచాయి. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండడంతో ఆలయంలో సేవలను పున: ప్రారంభిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అయితే కోవిడ్‌ నిబంధనలను అనుసరించి థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజర్‌ను ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు.