ట్రంప్, బిడెన్ సీరియస్‌ డిబెట్‌.. కామెడీ వీడియో

ఈ మధ్య అగ్రదేశమైన అమెరికా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఇప్పుడు ప్రపంచం కన్ను మొత్తం అమెరికా మీద ఉంది. ఎందుకంటారా..!! ఒకటి కరోనా.. రెండో ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌ రావడం.. మూడోది అధ్యక్ష ఎన్నికలు.. నాలుగోది ట్రంప్‌, బిడెన్‌ మధ్య జరిగిన డిబేట్‌. తాజాగా ఈ డిబెట్‌పై అటు అమెరికన్లలోనూ.. ఇటు ప్రపంచ వ్యాప్తంగా ఇంట్రెస్ట్‌ మొదలైంది. ఆ డిబెట్‌లో ట్రంప్‌పై బిడెన్‌ ఓ మెట్టు పైన నిలవడం కూడా ఈ ఆసక్తికి కారణమైంది. […]

Written By: NARESH, Updated On : October 4, 2020 5:40 pm
Follow us on


ఈ మధ్య అగ్రదేశమైన అమెరికా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఇప్పుడు ప్రపంచం కన్ను మొత్తం అమెరికా మీద ఉంది. ఎందుకంటారా..!! ఒకటి కరోనా.. రెండో ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌ రావడం.. మూడోది అధ్యక్ష ఎన్నికలు.. నాలుగోది ట్రంప్‌, బిడెన్‌ మధ్య జరిగిన డిబేట్‌. తాజాగా ఈ డిబెట్‌పై అటు అమెరికన్లలోనూ.. ఇటు ప్రపంచ వ్యాప్తంగా ఇంట్రెస్ట్‌ మొదలైంది. ఆ డిబెట్‌లో ట్రంప్‌పై బిడెన్‌ ఓ మెట్టు పైన నిలవడం కూడా ఈ ఆసక్తికి కారణమైంది. అంతేకాదు.. ఈ డిబెట్‌ను ఉద్దేశించి ఓ సాంగ్‌ కూడా రిలీజ్‌ కావడం విశేషం. ఈ డిబెట్‌కి ఓ యూట్యూబర్‌‌ కామెడీని జోడించాడు. అంత సీరియస్‌ డిబెట్‌ కాస్త ఇప్పుడు కామెడీ పీస్‌ అయిపోయింది.

Also Read: ట్రంప్ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ.!

ట్రంప్‌ ఎప్పుడు ఏది మాట్లాడినా సెన్సేషనలే. ఏం మాట్లాడుతారా ఆయనది ఆయనకు కూడా అర్థం కాదనేది అందరికీ తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‌ ఆయన. అందుకే ట్రంప్‌ మీద నిత్యం సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పుట్టుకొస్తూనే ఉంటాయి. పలు వీడియోలు కూడా వైరల్‌ అవుతుంటాయి. ప్రతి అంశాన్నీ నెటిజన్లు సీరియస్‌గా తీసుకుంటూనే పలు కామెడీ యాంగిల్‌ కూడా జోడిస్తుంటారు.

అమెరికా మ్యుజీషియన్, సాంగ్ రైటర్ వియర్డ్ అల్ యంకోవిక్ కొత్తగా చేసిన ఈ వీడియో కామెడీని తలపిస్తోంది. మొత్తం డిబేట్‌లోని కొన్ని పదాలను కట్ చేసి వాటికి మ్యూజిక్ సెట్ చేశాడు. తనే డిబేట్ నడిపించినట్లుగా మధ్య మధ్యలో పాట రూపంలో మాట్లాడాడు. ఇలా ఏదేదో చేసి… మొత్తానికి అందర్నీ మెప్పించే కామెడీ వీడియో సాంగ్ తయారుచేశాడు. అతను వాడిన క్యాచీ బీట్స్, ట్యూన్ నెటిజన్లకు బాగా నచ్చేస్తోంది. వుయ్ ఆర్ ఆల్ డూమ్డ్ అనే టైటిల్‌ పెట్టి యూట్యూబ్‌లో వదిలాడు యంకోవిక్. ఇందులో ట్రంప్, బిడెన్ చెప్పే సమాధానాలు కూడా పాటలాగే సాగుతుండటం విశేషం.

Also Read: ‘అటల్ టన్నెల్’ తో దేశానికి ఏం ఉపయోగం?

తమకు నచ్చిన లీడర్ల ప్రసంగాల కోసం అభిమానులు నిత్యం ఎదురుచూస్తూనే ఉంటారు. అలా వాక్చాతుర్యం కలిగిన నేతలు కూడా చాలా తక్కువగానే ఉంటారు. వాటి మాటలతోనే ఆటకట్టుకుంటుంటారు. అయితే.. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న అమెరికాలో అలాంటి లీడర్లు ప్రజలకు కనిపించడం లేదట. అందులోనూ ట్రంప్‌ చెప్తున్న విషయాలపై నిత్యం సెటైర్లు పడుతూనే ఉంటాయి. అందుకే.. ఇప్పుడు వచ్చిన ఈ కామెడీ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

https://www.youtube.com/watch?reload=9&v=un9x-DjTMT0&feature=emb_title