Good news for women : దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడే ఒక సంస్థ ఎస్బిఐ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ. ఈ సంస్థలో గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతను గుర్తించి వాళ్లకు శిక్షణ కల్పించడం, ప్రేరేపించడం అలాగే వారికి స్వయం ఉపాధిని కల్పించడం వంటి ఉమ్మడి లక్ష్యాలతో కలిసి పనిచేస్తున్నాయి.ఈ సంస్థ ద్వారా నిరుద్యోగులైన వారికి స్థిరమైన జీవన ఉపాధి కల్పించడమే దీని ముఖ్య లక్ష్యంగా పరిగణించబడుతుంది. ఇందులో అందించే ఉచిత కోర్సులు ఉత్పత్తి, వ్యవసాయం అలాగే జనరల్ అనే క్యాటగిరి లో విభజించబడ్డాయి. దేశవ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులు ఈ సంస్థలలో ఉచితంగా శిక్షణ పొంది ఉపాధి పొందారు. ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మీకు ఉచితంగా శిక్షణ అందించడంతోపాటు ఉచితంగా వసతి మరియు ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
ఎస్బిఐ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కింద ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నిరుద్యోగ మహిళలకు టైలరింగ్ లో ఉచిత శిక్షణ కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి వరంగల్ ఎస్ బి ఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ అయిన బాసరవి పూర్తి వివరాలను ఒక ప్రకటనలో తెలియజేశారు. 18 నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగిన హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, జనగామ, ములుగు మరియు మహబూబాబాద్ జిల్లాలకు చెందిన మహిళలు ఈ సంస్థ కింద ఉచితంగా శిక్షణ పొందడానికి అర్హులు. ఈ సంస్థలో టైలరింగ్ లో మహిళలకు 31 రోజులపాటు ఉచితంగా శిక్షణ అందిస్తారు.
Also Read : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!
అలాగే శిక్షణ సమయంలో వీరికి ఉచిత భోజనం మరియు ఉచిత వసతి సదుపాయం కూడా కల్పిస్తున్నారు. అలాగే కోర్సుకు సంబంధించిన మెటీరియల్, కోర్స్ పూర్తి చేసిన తర్వాత వాళ్లందరికీ సర్టిఫికెట్ కూడా అందిస్తారు. జూన్ 9వ తేదీ వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలు ఈ ఉచిత శిక్షణ పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలుగులో చదవడం మరియు రాయడం వచ్చిన మహిళలు దీనికి అర్హులు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ మహిళలు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.