Good news for gold Buyers : ముఖ్యంగా జనవరి నుంచి మార్చి నెలలో బంగారం ధరలు బాగా పెరిగాయి. ఏప్రిల్ నెలలో తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకొని ఆల్ టైం హై రికార్డును క్రియేట్ చేసింది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం బంగారం ధరలు 98 వేల దగ్గర స్వల్పంగా తగ్గుతూ ఉన్నాయి. మనదేశంలోమహిళలు బంగారాన్ని ఎంతగానో ఇష్టపడతారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ సందర్భంగా ఏదైనా కూడా ప్రతి ఒక్కరు ముందుగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ రోజు బంగారంలో ఉండే మార్పులను గమనిస్తూ ఉంటారు. రెండు జూన్, 2025 సోమవారం రోజున స్వచ్ఛమైన బంగారం ఒక తులం రూ.97,300, 22 క్యారెట్ల తులం బంగారం రూ.89,190 గా ఉంది.
ఇక మన దేశంలో పలు ప్రధాన నగరాలు ముంబై, చెన్నై మరియు బెంగళూరు నగరంలో నేడు స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.97,300, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,190 గా ఉంది.
ఇక ఢిల్లీ నగరంలో ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం రూ.97,450, 22 క్యారెట్ల తులం బంగారం రూ.89,340 గా ఉంది.
ఇక మన తెలుగు రాష్ట్రాలలో పలు ప్రధాన నగరాలు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం రూ.97,300, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,190 గా ఉంది.
ఇక వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ నగరాలలో స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.97,300, 22 క్యారెట్ల తులం బంగారం రూ.89,190 గా ఉంది.
ఇక మన దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాలలో ఈరోజు కిలో వెండి రూ.1,10,800 గా ఉందని సమాచారం.