https://oktelugu.com/

ప్రజలకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ కే కరోనా వ్యాక్సిన్

ఇన్నాళ్లు కరోనాతో ప్రపంచ దేశాలు గడగడలాడిపోయాయి. ఏ దేశంలో చూసినా లాక్‌డౌన్‌ అమలు చేశారు. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ కూడా స్టార్ట్‌ కావడంతో పలు దేశాల్లో మరోసారి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. వైరస్‌ తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలూ భయపడిపోతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. విచిత్రమైన విషయం ఏంటంటే లక్షణాలు లేకుండానే చాలా మంది ఆ వైరస్‌ బారిన పడుతున్నారు. Also Read: కరోనా భారత్‌కు ఎంత మేలు చేసిందో తెలుసా? […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2020 / 02:54 PM IST
    Follow us on

    ఇన్నాళ్లు కరోనాతో ప్రపంచ దేశాలు గడగడలాడిపోయాయి. ఏ దేశంలో చూసినా లాక్‌డౌన్‌ అమలు చేశారు. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ కూడా స్టార్ట్‌ కావడంతో పలు దేశాల్లో మరోసారి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. వైరస్‌ తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలూ భయపడిపోతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. విచిత్రమైన విషయం ఏంటంటే లక్షణాలు లేకుండానే చాలా మంది ఆ వైరస్‌ బారిన పడుతున్నారు.

    Also Read: కరోనా భారత్‌కు ఎంత మేలు చేసిందో తెలుసా?

    ఇప్పుడు క్రిస్మస్‌ కానుకగా ప్రజలకు ఓ గుడ్‌న్యూస్‌ అందబోతోంది. ఇన్నాళ్లు వైరస్‌ కోసం ఎదురుచూసిన ప్రజలకు దగ్గరలోనే అందుబాటులోకి రానుంది. కరోనా నివారణకు పైజర్‌‌–బయోఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతా సానుకూలంగా జరిగితే క్రిస్మస్‌ కంటే ముందే ఈ టీకా పంపిణీ ప్రారంభిస్తామని బయోఎన్‌టెక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉగర్‌‌ సహిన్‌ వెల్లడించారు.

    టీకా ప్రయోగాలు పూర్తయినట్లు ఫైజర్‌‌, బయో ఎన్‌టెక్‌ బుధవారం ప్రకటించింది. ప్రయోగాల్లో దీని సామర్థ్యం 95 శాతం వరకు ఉందని తేలినట్లు వెల్లడించాయి. అత్యవసర అనుమతుల కోసం అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌, యూరోపియన్‌ యూనియన్‌కు దరఖాస్తు చేసినట్లు ఉగర్‌‌ సహిన్‌ తెలిపారు. డిసెంబరు రెండో అర్ధభాగంలో అనుమతులు రావొచ్చని భావిస్తున్నామని చెప్పారు.

    Also Read: బీజేపీ అసలు టార్గెట్ అదేనా

    ఈ ఏడాది చివరి నాటికి 5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సిద్ధం చేస్తామని ఫైజర్‌‌ వెల్లడించింది. వీటివల్ల 2.5 కోట్ల మందిని కరోనా నుంచి కాపాడుకోవచ్చని చెప్పింది. అలాగే 2021 నాటికి 13 కోట్ల డోసులు తయారు చేస్తామని సంస్థ వెల్లడించింది. ఇప్పటికే బ్రెజిల్‌, జర్మనీ, జపాన్‌, యూరోపియన్‌ యూనియన్‌తో ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. ఫైజర్‌‌ టీకాను మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరచవలసి ఉంటుందని తెలిపారు. అందుకే టీకా రవాణా కష్టంగా మారిందన్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్