ఎన్నో ఉత్కంఠల మధ్య అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు జో బైడెన్. జనవరి 20న ఆయన బాధ్యతలు తీసుకోనుండగా.. ఆరోగ్య సిబ్బందితో ఆయన ఓ కీలక ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన జో బైడెన్ కంటతడి పెట్టారు. కరోనా విధుల్లో ఉన్న ఆ దేశ ఆరోగ్య సిబ్బంది తమ క్షేత్ర స్థాయి అనుభవాలను కాబోయే అధ్యక్షుడికి వివరించారట.
Also Read: ప్రజలకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ కే కరోనా వ్యాక్సిన్
ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా మిన్నెసోటాకు చెందిన మేరీ టర్నర్ అనే నర్సు మరణానికి చేరువలో ఉన్న కోవిడ్ బాధితులతో తన అనుభవాలను వివరించారు. కోవిడ్ బాధితులు తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం పరితపించే వారని.. వారి చేతులను తన చేతుల్లోకి తీసుకొని ఓదార్చానని మేరీ చెప్పింది. అది విన్న బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు.
కరోనా కారణంగా ప్రపంచ దేశాలు కుదేలయ్యాయి. అందులోనూ అగ్రదేశమైన అమెరికా కూడా అన్ని దేశాలకు మించి అతలాకుతలం అయింది. లక్షలాది కేసులు నమోదవుతున్న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆదిలో స్పందించకపోవడంతో వైరస్ ఉధృతి పెరిగింది. ఒకానొక సందర్భంలో మాస్కులు ధరించడం ముఖ్యమని డాక్టర్లు చెప్పిన సూచనలనూ కొట్టి పారేశారు ఆయన. తమ దేశం ‘కింగ్ ఆఫ్ వెంటిలేటర్స్’ అంటూ పదే పదే ప్రకటించారు.
Also Read: కరోనా భారత్‌కు ఎంత మేలు చేసిందో తెలుసా?
తాజాగా.. నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ కాన్ఫరెన్స్ ద్వారా కొత్త అధ్యక్షుడు బైడెన్ దృష్టికి తీసుకొచ్చారు. పీపీఈ కొరత ఉందని.. రక్షణ కోసం ప్లాస్టిక్ సంచులను వాడుతున్నామని తెలిపారు. ఎన్ 95 మాస్కులను మళ్లీమళ్లీ వాడడంతో అవి లూజ్ అయిపోతున్నాయని చెప్పారు. కింద పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు