https://oktelugu.com/

కాజల్ పెళ్లి ఖర్చు కంటే.. హనీమూన్ ఖర్చే ఎక్కువ.. షాకవుతున్న ఫ్యాన్స్..!

కాజల్ అగర్వాల్ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ అయిన గౌతమ్ కిచ్లూను పెళ్లాడింది. ఇటీవలే ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ భర్తతో కలిసి ఫుల్ రోమాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ను కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె హనీమూన్ ఖర్చుపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. Also Read: ఇండస్ట్రీలో కలకలం: మెగాస్టార్ ఎందుకిలా చేస్తున్నాడు? కాజల్ అగర్వాల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2020 / 02:51 PM IST
    Follow us on

    కాజల్ అగర్వాల్ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ అయిన గౌతమ్ కిచ్లూను పెళ్లాడింది. ఇటీవలే ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ భర్తతో కలిసి ఫుల్ రోమాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ను కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె హనీమూన్ ఖర్చుపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

    Also Read: ఇండస్ట్రీలో కలకలం: మెగాస్టార్ ఎందుకిలా చేస్తున్నాడు?

    కాజల్ అగర్వాల్ కరోనా సాకుతో పెళ్లిని మాత్రం చాలా సింపుల్ గా కానిచ్చేసింది. పెళ్లి తర్వాత షూటింగ్ పాల్గొంటుందని అందరూ భావించగా అనుహ్యంగా ఆమె హనీమూన్ కోసం మాల్డీవులకు వెళ్లింది. అక్కడే భర్తతో కలిసి బీచులు.. రెస్టారెంట్స్ తిరుగుతూ.. అండర్ వాటర్ రూంలో సేదతీరుతూ హనీమూన్ ను ఎంజాయ్ చేశారు.

    పెళ్లికి పెద్దగా ఖర్చుపెట్టని కాజల్ హనీమూన్ మాత్రం కోట్లలో ఖర్చు పెడుతోంది. కాజల్ హనీమూన్ బడ్జెట్ పరిశీలిస్తే అదృష్టం అంటే ఆమెదేనని అంటారు. కాజల్ హనీమూన్ కోసం హిందూ మల్దీవులకు వెళ్లింది. ప్రపంచంలోనే మొట్టమొదట నిర్మించిన అత్యంత ఖరీదైన అండర్ వాటర్ హోటల్ మురాకాలో కాజల్-గౌతమ్ రోమాన్స్ చేశారు.

    హనీమూన్ భాగంగా కాజల్ తన భర్తతో నీటిఅడుగున గాజుతో కప్పబడిన బెడ్ రూంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందమైన వేలాది చేపల నడుమ వీరిద్దరు కొన్నిరోజులు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. దీనిలో ఒక్క రాత్రికి అయ్యే ఖర్చు యాబై వేల డాలర్లు.. అంటే మన కరెన్సీలో 38లక్షలు అన్నమాట. వీరిద్దరు పదిరోజులపాటు అక్కడే హ్యాపీగా గడిపారు.

    Also Read: కరోనా క్రైసిస్ నుంచి చిత్ర పరిశ్రమ కోలుకునేదెన్నడూ?

    వీరి బస.. ఆహారం.. ఇతర సందర్శనలకు కలిసి ఐదు కోట్ల పైనే ఖర్చు చేసినట్లు టాక్ విన్పిస్తోంది. కాజల్ పెళ్లికి ధరించిన డ్రెస్ విలువ 10లక్షల పైనేనట. ఈ పెళ్లి డ్రెస్ కోసం ఏకంగా 20మంది వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాజల్ హనీమూన్ నుంచి తిరిగొచ్చాక సినిమా షూటింగులో పాల్గొననుంది.

    పెళ్లిని సింపుల్ కానిచ్చిన కాజల్ కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత సినిమా తారల కోసం కాజల్ దంపతులు గ్రాండ్ పార్టీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఎంతైనా కాజల్ అదృష్టమే.. అదృష్టమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్