https://oktelugu.com/

వాహనదారులకు గుడ్ న్యూస్

డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిపోతోంది. ఆర్సీ దాటిపోయింది.. రిజిస్ట్రేషన్ చేసుకుందాంటే ఆర్టీఏ ఆఫీసులు కరోనా లాక్ డౌన్ తో మూతపడ్డాయి. మరి ఎలా రోడ్డెక్కితే ఫైన్లు వేసేస్తున్నారు. దీంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులను తాజాగా కేంద్రప్రభుత్వం తీర్చింది. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గడువు ముగిసి ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఊరట కల్పించింది. మోటార్ వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) , రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) , ఇతర పర్మిట్లకు సంబంధించిన పత్రాల […]

Written By:
  • NARESH
  • , Updated On : June 17, 2021 / 08:44 PM IST
    Follow us on

    డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిపోతోంది. ఆర్సీ దాటిపోయింది.. రిజిస్ట్రేషన్ చేసుకుందాంటే ఆర్టీఏ ఆఫీసులు కరోనా లాక్ డౌన్ తో మూతపడ్డాయి. మరి ఎలా రోడ్డెక్కితే ఫైన్లు వేసేస్తున్నారు. దీంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులను తాజాగా కేంద్రప్రభుత్వం తీర్చింది.

    వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గడువు ముగిసి ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఊరట కల్పించింది. మోటార్ వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) , రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) , ఇతర పర్మిట్లకు సంబంధించిన పత్రాల గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

    2020 ఫిబ్రవరి 1తో గడువు ముగిసిన మోటార్ వాహనాల పత్రాలను ఈ ఏడాది సెప్టెంబర్ 30వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా వేళ వాహనదారులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

    ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు చేసింది. ఇప్పటికే గత ఏడాది కరోనా నుంచి పలు మార్లు ధ్రువపత్రాల గడువును కేంద్రం పొడిగిస్తూ వచ్చింది. చివరగా ఈ ఏడాది మార్చి 26న సైతం ఇలాంటి ఉత్తర్వులే ఇవ్వడం విశేషంగా మారింది.