https://oktelugu.com/

డబ్బును ఆదా చేయాలనుకుంటుకున్నారా.. పాటించాల్సిన నియమాలివే..?

మనలో చాలామంది నెల జీతం బ్యాంక్ ఖాతాలో జమైన వెంటనే ఆన్ లైన్ లో నచ్చిన వస్తువులను ఇష్టానుసారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ తరువాత ఖాతాలో డబ్బులు లేకపోవడం వల్ల అప్పులు చేయాల్సి వస్తే బాధ పడుతూ ఉంటారు. వెబ్ సైట్ల లోని ఆఫర్లకు ఆకర్షితులై షాపింగ్ చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎప్పుడైనా ఒకసారి అలా కొనుగోలు చేస్తే తప్పు లేదు కానీ ప్రతి నెలా అలా చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇష్టాలు, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 17, 2021 / 08:39 PM IST
    Follow us on

    మనలో చాలామంది నెల జీతం బ్యాంక్ ఖాతాలో జమైన వెంటనే ఆన్ లైన్ లో నచ్చిన వస్తువులను ఇష్టానుసారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ తరువాత ఖాతాలో డబ్బులు లేకపోవడం వల్ల అప్పులు చేయాల్సి వస్తే బాధ పడుతూ ఉంటారు. వెబ్ సైట్ల లోని ఆఫర్లకు ఆకర్షితులై షాపింగ్ చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎప్పుడైనా ఒకసారి అలా కొనుగోలు చేస్తే తప్పు లేదు కానీ ప్రతి నెలా అలా చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.

    ఇష్టాలు, విలాసాల కొరకు డబ్బును ఆదా చేయాలనుకోవడంలో తప్పు లేకపోయినా అత్యవసరం కాని వస్తువులను కొనుగోలు చేయకపోతే మంచిది. అనవసర వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక ప్రణాళిక దెబ్బ తినే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో 30 రోజుల నియమం పాటిస్తే మంచిది. భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా చేయడంలో ఈ నియమం ఉపయోగపడుతుంది.

    ఏ వస్తువును కొనుగోలు చేయాలన్నా 30 రోజులు ఆ వస్తువును కొనుగోలు చేయడాన్ని వాయిదా వేస్తే సరిపోతుంది. 30 రోజుల తర్వాత కూడా ఆ వస్తువు ముఖ్యమని భావిస్తే కొనుగోలు చేయడం అనవసరం అనిపిస్తే కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది. ఈ నియమం పాటించాలనుకునే వారు వస్తువు ధరకు సమానమైన డబ్బును దాచేయాలి. 30 రోజుల తర్వాత ఆ వస్తువు అవసరం లేదని భావిస్తే భవిష్యత్ ప్రణాళికల కొరకు ఆ మొత్తాన్ని ఖర్చు చేయాలి.

    మొదట్లో ఈ నియమం నచ్చకపోయినా కొన్ని సందర్భాలు ఎదురైతే ఈ నియమం వల్ల లాభాలు తెలుస్తాయి. డబ్బును ఆదా చేయాలనుకునే వారు పోస్టాఫీస్, ఎల్.ఐ.సీ, ఇతర పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా దీర్ఘ కాలంలో ప్రయోజనం చేకూరుతుంది.