LIC : భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) తన పాలసీదారుల కోసం ఒక కీలక ప్రకటన చేసింది. ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి ఇకపై ఏజెంట్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొనే వాట్సాప్ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. దీని కోసం ఎల్ఐసీ ఒక వాట్సాప్ బాట్‌ను రిలీజ్ చేసింది. మీరు ఇంట్లో కూర్చొని ప్రీమియం ఎలా చెల్లించవచ్చో..దాని ప్రాసెస్ ఏమిటో వివనంగా ఈ వార్తలో తెలుసుకుందాం.
ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి 8976862090 నంబర్‌ను రిలీజ్ చేసింది. ఈ వాట్సాప్ నంబర్‌కు మీరు మెసేజ్ చేయడం ద్వారా UPI ద్వారా చెల్లింపు చేసి మీ పాలసీ ప్రీమియాన్ని చెల్లించవచ్చు. ఈ ఆప్షన్ ఎల్ఐసీ వినియోగదారులకు ప్రీమియాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించే సౌలభ్యాన్ని అందిస్తుందని బీమా సంస్థ తెలిపింది. దీని ద్వారా కస్టమర్‌లు బాట్ ద్వారానే చెల్లింపు చేయవచ్చు.
Also Raed : హోమ్ లోన్ పై భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఎల్ఐసి…
ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
వాట్సాప్ ద్వారా పాలసీ ప్రీమియం చెల్లించడానికి ముందుగా మీరు 8976862090 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత బాట్ యాక్టివేట్ అవుతుంది. మీ చాట్ స్క్రీన్‌పై అనేక ఆప్షన్‌లు కనిపిస్తాయి. మీకు కావలసిన సర్వీసు సెలక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు.. మీరు పాలసీ ప్రీమియం చెల్లించాలనుకుంటే ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
1. ముందుగా లింక్‌పై క్లిక్ చేసి అక్కడ పాలసీ నంబర్ నమోదు చేయాలి.
2. తర్వాత మీరు పన్ను లేకుండా ప్రీమియం మొత్తాన్ని నమోదు చేయాలి.
3. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ ఫోటోను .jpg లేదా .jpeg ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
4. www.licindia.in వెబ్‌సైట్‌కు వెళ్లి కస్టమర్ పోర్టల్‌పై క్లిక్ చేయాలి.
5. మీరు అక్కడ రిజిస్టర్ చేసుకోకపోతే కొత్త ఐడి కోసం క్లిక్ చేయాలి.
7. అక్కడ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
ఆ తర్వాత కొత్త ఐడితో మళ్లీ లాగిన్ చేయాలి. ఆ తర్వాత మీరు పాలసీని యాడ్ చేయవచ్చు. అప్పుడు మీరు బేసిక్ సర్వీసులను పొందవచ్చు.
Also Read : కేవలం 4 ఏళ్లలో రూ.1 కోటి ఇచ్చే LIC అద్భుతమైన ప్లాన్…