LIC home loan : ఈ క్రమంలో సొంత ఇంటి కోసం రుణం తీసుకునే వారికి తాజాగా ఎల్ఐసి హెచ్ ఎఫ్ ఎల్ ఒక శుభవార్త తెలిపింది. తాజాగా గృహ రుణానికి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఎల్ ఐ సి హెచ్ ఎ పి ఎల్ బెంచ్ మార్కును 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు సమాచారం. తగ్గిన ఈ రేటు ఇప్పటికే ఉన్న రుణ గ్రహీతలతో పాటు కొత్తగా గృహ రుణం తీసుకుంటున్న వారికి కూడా చాలా ప్రయోజనం కలుగుతుందని తాజాగా ఒక ప్రకటనలో ఎల్ఐసి తెలిపింది. ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును 0.25% తగ్గించిన సంగతి తెలిసిందే.
Also Read : మీకు IPO కేటాయింపులో సమస్య వస్తుందా? ఇంతకీ ఏం చేయాలంటే?
ఆర్బిఐ రేపో రేటును తగ్గించిన తర్వాత ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ గృహ రుణ బెంచ్ మార్కుల ఈ రేటును తగ్గించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం గృహ రుణాలకు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ వడ్డీ రేటు ఎనిమిది శాతం నుంచి ప్రారంభం అవుతుంది. తాజాగా నిపుణులు ఈ రేటు తగ్గిన కారణంగా గురుహరణ వడ్డీ మొత్తం మరింత అందుబాటులోకి రానుందని చెప్తున్నారు. మార్చబడిన ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 28 నుంచి అమలు చేయబడతాయి. సాధారణంగా గృహ రుణాలను రెండు వర్గాలుగా విభజిస్తారు. వాటిలో ఫిక్స్డ్ రేట్ గృహ రుణాలు మరియు ఫ్లోటింగ్ రేట్ గృహ రుణాలు. అయితే తాజాగా తగ్గించిన ఈ రేటు ఫ్లోటింగ్ రేట్ గృహ రుణాలకు చాలా ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. గృహ రుణం బెంచ్ మార్క్ రేటు పై ఫ్లోటింగ్ గృహ రుణం వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది.
ఈ క్రమంలో బెంచ్ మార్క్ రేట్ మారినప్పుడల్లా ఫ్లోటింగ్ వడ్డీ రేటు కూడా మారుతూ ఉంటుంది. సాధారణంగా ఎల్ఐసి అందిస్తున్న ఫిక్స్డ్ వడ్డీ రేటు తో ఉండే గృహ రుణాలతో పోలిస్తే ఫ్లోటింగ్ వడ్డీరేట్లు చాలా చౌకగా ఉంటాయని సమాచారం. ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు కంటే కూడా ఫిక్స్డ్ వడ్డీ రేట్లు ఒక శాతం నుంచి 2.5% ఎక్కువగానే ఉంటాయి. అయితే ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు తాత్కాలికంగా పెరుగుదల మరియు తగ్గుదల కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు మార్కెట్ ట్రెండ్లు మరియు బెంచ్ మార్క్ రేట్ల కదలిక, బ్యాంకు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. బెంచ్ మార్గ రేపోరేట్ తో గృహ రుణాలు మరియు ఇతర రుణాలు కూడా అనుసంధానం అయ్యి ఉన్నాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ పై తీసుకునే నిర్ణయాన్ని బట్టి గృహ రుణాల వడ్డీ రేట్లు కూడా మారుతూ ఉంటాయి.