ఏపీ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే ఉల్లిపాయలు..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. సబ్సిడీపై రైతుబజార్లలో ఉల్లిపాయలు విక్రయించే దిశగా అడుగులు వేస్తున్నారు. రోజురోజుకు ఉల్లిధరలు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. మార్కెట్ లో ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు 50 రూపాయల నుంచి 70 రూపాయలు పలుకుతున్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల పంట దిగుబడి భారీగా తగ్గింది. దీంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే […]

Written By: Navya, Updated On : October 20, 2020 2:01 pm
Follow us on


ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. సబ్సిడీపై రైతుబజార్లలో ఉల్లిపాయలు విక్రయించే దిశగా అడుగులు వేస్తున్నారు. రోజురోజుకు ఉల్లిధరలు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. మార్కెట్ లో ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు 50 రూపాయల నుంచి 70 రూపాయలు పలుకుతున్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల పంట దిగుబడి భారీగా తగ్గింది.

దీంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో ధర ఇంకా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందుగానే సబ్సిడీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉల్లిని విక్రయించేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో ఈ సంవత్సరం 40 వేల హెక్టార్లలో ఉల్లి పంటను సాగు చేశారు. అయితే మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో సైతం వర్షాల వల్ల దిగుబడి భారీగా తగ్గింది. ఉల్లిని ఎక్కువగా పండించే మహారాష్ట్రంలో సైతం ఉల్లి దిగుబడి భారీగా తగ్గింది.

దీంతో రాష్ట్రంలో పండిన ఉల్లి రేటు రోజురోజుకు పెరుగుతుండగా కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు గతేడాదిలాగే ఈ ఏడాది కూడా ఉల్లి కిలో 100 రూపాయలు పలికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో ఉల్లి నిల్వలు కూడా తగ్గుతున్నాయని తెలుస్తోంది. ఉల్లి ధరలు పెరిగితే సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలపైనే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

గతేడాది జగన్ సర్కార్ 25 రూపాయలకు కిలో చొప్పున ఉల్లిని విక్రయించింది. ఫలితంగా రాష్ట్రంలోని రైతులకు, ఉల్లి వినియోగదారులకు ప్రయోజనం చేకూరింది. జగన్ సర్కార్ ఈ సంవత్సరం కూడా రైతు బజార్ల ద్వారా ఉల్లి విక్రయాలు చేపడితే ప్రజలకు తక్కువ ధరకే ఉల్లి లభ్యమయ్యే అవకాశం ఉంది.