బ్రేకింగ్: 6 గంటలకు ప్రజల ముందుకు మోడీ.. ఏం చెప్తారు?

ప్రధాని మోడీ ఈసాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడబోతున్నట్టు ప్రకటించారు. సాయంత్రం 6 గంటలకు  మీడియా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏం చెప్తారు? గుడ్ న్యూసా? లేక వ్యాక్సిన్ గురించా అన్న ఆసక్తి నెలకొంది. కరోనా వైరస్‌పై కీలక ప్రకటన చేస్తారని అంటున్నారు.. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ తయారీపైనా ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. Also Read: ఏపీ ప్రజలకు శుభవార్త.. […]

Written By: NARESH, Updated On : October 20, 2020 3:54 pm
Follow us on

ప్రధాని మోడీ ఈసాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడబోతున్నట్టు ప్రకటించారు. సాయంత్రం 6 గంటలకు  మీడియా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏం చెప్తారు? గుడ్ న్యూసా? లేక వ్యాక్సిన్ గురించా అన్న ఆసక్తి నెలకొంది. కరోనా వైరస్‌పై కీలక ప్రకటన చేస్తారని అంటున్నారు.. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ తయారీపైనా ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: ఏపీ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే ఉల్లిపాయలు..?

“ఈ సాయంత్రం 6 గంటలకు నా తోటి పౌరులతో ఒక సందేశాన్ని పంచుకుంటాను” అని పిఎం మోడీ ట్వీట్ చేశారు. మోడీ ప్రసంగం ఏమిటనేది స్పష్టంగా తెలియకపోగా, కోవిడ్ -19 కేసుల సంఖ్య తగ్గడం మరియు కోవిడ్ -19 వ్యాక్సిన్ పంపిణీ కోసం భారతదేశం ప్రణాళిక గురించి ప్రధాని మాట్లాడబోతున్నారని సమాచారం.

కోవిడ్ -19 వ్యాక్సిన్ ను భారత ఫార్మా కంపెనీలు శరవేగంగా తయారు చేస్తున్నాయి. ప్రముఖ ఫార్మా కంపెనీల అనేక టీకాలు వివిధ దశలలో ఉన్నాయి. వాటిలో కొన్ని చివరి దశలో ఉన్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకుని టీకా పంపిణీ కోసం ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించాలని యోచిస్తోంది.రెండు లేదా మూడు మోతాదుల వ్యాక్సిన్ ను దేశ ప్రజలకు ఇవ్వవచ్చని.. దేశ ప్రజలందరికీ వేసేలా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక ఆరోగ్య ఐడితో రాబోతోందని సమాచారం. డిజిటల్ హెల్త్ ఐడి కార్డును తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

Also Read: వైసీపీ, టీడీపీల టార్గెట్‌ బీసీలేనా..?

ఈ క్రమంలోనే మోడీ దిశానిర్ధేశం చేయబోతున్నట్టు సమాచారం. కరోనా వైరస్ వ్యాపించిన తొలి నాళ్లలో తరుచుగా మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించి పలు సలహాలు సూచనలు దేశ ప్రజలకు చేశారు. ఆ తర్వాత కేసులు తగ్గకపోగా పెరగడంతో ఇక మీడియా ముందుకు రాలేదు. మళ్లీ చాలా రోజులకు మీడియా ముందుకు వస్తుండడంతో ఆసక్తి నెలకొంది.