Goa Congress: దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. పరాజయాల బాటలోనే తన ప్రస్థానం కొనసాగుతోంది. దీంతో పలు స్టేట్లలో కూడా అధికారానికి దూరమవుతోంది. స్వయంకృతాపరాధంతోనే తన ఉనికి కోల్పోతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోంది. దీంతో అధికారం దానికి అందని ద్రాక్షగానే మిగులుతోంది. కానీ నాయకత్వ లోపంతో విజయం దక్కడం లేదని తెలుస్తోంది.

అన్ని స్టేట్లలో కూడా అసమ్మతి రేగుతోంది. అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. పార్టీ విధానాలు నచ్చక చాలా మంది దూరం అవుతున్నారు. అయినా పార్టీ ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయడం లేదు. పాత పద్ధతులను పాటిస్తూ తన ఉనికిని ప్రశ్నార్థకం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే నేతలను పార్టీ వీడిపోయేలా చేస్తోంది.
Also Read: చైనా కోసం అమెరికానే పాకిస్తాన్ వదులుకునే సాహసం చేస్తోందా?
తాజాగా గోవాలో పార్టీ పరిస్థితి అధ్వానంగా మారింది. పార్టీ విధానాలు విభేదించి చాలా మంది పార్టీని వీడుతున్నారు. కీలక సమయంలో నేతలు దూరం కావడంతో రాష్ర్టంలో పార్టీ పరిస్థితి అధ్వానంగా మారుతోంది. ప్రియాంక గాంధీ రాష్ర్ట పర్యటనకు వస్తున్న సమయంలో కూడా నేతల్లో సమన్వయం కానరావడం లేదు. దీంతో అధికారం పార్టీకి దక్కదనే విషయం స్పష్టమవుతోంది.
మరోవైపు అనైతిక పొత్తులతో కూడా పార్టీకి ఎదురుదెబ్బలే తగలనున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతల అభిప్రాయాలు లెక్కలోకి తీసుకోకుండా అధిష్టానం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగా పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కానుంది. కొద్ది రోజులుగా పార్టీ అపఖ్యాతి పాలవుతుందని తెలుస్తోంది. అధికారం మాత్రం వారికి దక్కడం గగనమే అని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Also Read: రాజ్యసభ్య సీట్లపై సీఎం కసరత్తు.. రేసులో మోత్కుపల్లి?