https://oktelugu.com/

Rajya Sabha: రాజ్యసభ సీట్లపై సీఎం కసరత్తు.. రేసులో మోత్కుపల్లి?

Rajya Sabha seats: తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ తాజాగా ముగిసింది. దీంతో సీఎం కేసీఆర్ ఇప్పుడు రాజ్యసభ సీట్ల కేటాయింపుపై భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు. త్వరలనే మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మూడు కూడా టీఆర్ఎస్ కే దక్కనుండటంతో సీఎం కేసీఆర్ ఎవరెవరెనీ పెద్దల సభకు పంపుతారనే ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు గతంలో ఎంపికైన ధర్మపురి శ్రీనివాస్(డీఎస్), కెప్టెన్ లక్ష్మీకాంతరావుల పదవీ కాలం జూన్ నెలలో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 11, 2021 / 11:19 AM IST
    Follow us on

    Rajya Sabha seats: తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ తాజాగా ముగిసింది. దీంతో సీఎం కేసీఆర్ ఇప్పుడు రాజ్యసభ సీట్ల కేటాయింపుపై భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు. త్వరలనే మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మూడు కూడా టీఆర్ఎస్ కే దక్కనుండటంతో సీఎం కేసీఆర్ ఎవరెవరెనీ పెద్దల సభకు పంపుతారనే ఆసక్తి నెలకొంది.

    KCR

    టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు గతంలో ఎంపికైన ధర్మపురి శ్రీనివాస్(డీఎస్), కెప్టెన్ లక్ష్మీకాంతరావుల పదవీ కాలం జూన్ నెలలో పూర్తికానుంది. మరో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ ఇటీవల తన పదవీకి రాజీనామా చేసి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈనేపథ్యంలో కేసీఆర్ క్యాబినెట్లోకి బండా ప్రకాశ్ చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

    ఈ మూడు స్థానాల కోసం టీఆర్ఎస్ లో పోటీ ఎక్కువగానే  కన్పిస్తోంది. ఎమ్మెల్సీ సీటు దక్కని ఆశావహులంతా రాజ్యసభ సీటును దక్కించుకునేందు పావులు కదుపుతున్నారు. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం పెద్దల సభకు వెళ్లే అభ్యర్థులకు ఖారరు చేసే పనిలో పడింది. ఈ లిస్టులో ప్రముఖంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్, మోత్కుపల్లి శ్రీనివాస్ పేర్లు విన్పిస్తున్నాయి.

    రాజ్యసభ స్థానాల్లో ఒక ఎస్సీ, బీసీ, ఓసీ వర్గాలకు కేటాయించే అవకాశం ఉంది. ఇందులో ఒకటి కరీంనగర్ మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కు రాజ్యసభ ఖరారైనట్లు వార్తలు విన్పిస్తున్నాయి. వినోద్ కుమార్ కు ఎంపీగా చేసిన అనుభవం ఉండటంతో ఆయన్ని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమన్వయకర్తగా వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.

    ఇక మిగిలిన స్థానాల కోసం ఎంపీ సీతారాం నాయక్‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మోత్కుపల్లి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కర్నె ప్రభాకర్ తదితర నేతలు పోటీ పడుతున్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నేత మోత్కుపల్లికి ఎమ్మెల్సీ సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ జరుగలేదు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో మోత్కుపల్లికి రాజ్యసభ సీటు ఇస్తారనే వార్తలు టీఆర్ఎస్ లో విన్పిస్తున్నాయి.

    ఇటీవల సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. దళిత వర్గాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే మోత్కుపల్లిని ఆయన చేరదీసినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ నుంచి టీఆర్ఎస్ చేరిన రమణకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడంతో మోత్కుపల్లికి రాజ్యసభ ఇవ్వడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. అయితే టీఆర్ఎస్ పోటీ మాత్రం తీవ్రస్థాయిలో ఉండటంతో సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. దీంతో చివరి నిమిషంలో తెరపైకి కొత్త పేర్లు వచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ సైతం టీఆర్ఎస్ నడుస్తోంది.