Alia Bhatt-Rajamouli: రాజమౌళి గొప్ప దర్శకుడే కాదు, మార్కెటింగ్ జీనియస్ కూడా. తన చిత్రాలను ప్రమోట్ చేయడంలో, వాటికి భారీ మార్కెట్ జరిగేలా చూడడంలో దిట్ట. అదే సమయంలో తన ప్రమోషనల్ స్ట్రాటజీల ద్వారా థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పిస్తాడు. బాహుబలి మూవీ విషయంలో రాజమౌళి ప్రచార జిమ్మిక్కులు సూపర్ సక్సెస్ అయ్యాయి. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు…’ అనే ఈ ఒక్క వాక్యంతో బాహుబలి 2 కి విపరీతంగా ప్రచారం కల్పించారు. బాహుబలి 1 విడుదల తర్వాత రెండేళ్లకు బాహుబలి 2 విడుదల కాగా… ఈ రెండేళ్లు దీని గురించే జనాలు చర్చించుకునేలా చేశాడు.

అలాగే ఆర్ఆర్ఆర్ మూవీ కోసం రాజమౌళి ప్రమోషన్స్ విపరీతంగా నిర్వహిస్తున్నాడు. మూవీ విడుదలకు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా… తన టీమ్ తో పాటు ప్రధాన నగరాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే బెంగుళూరు, చెన్నై నగరాల్లో ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రెస్ మీట్స్ నిర్వహించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు హీరోయిన్ అలియా భట్, నిర్మాత దానయ్య ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు.
అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది అలియా భట్ క్రమం తప్పకుండా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. నవంబర్ 9న ముంబైలో జరిగిన హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అలియా పాల్గొన్నారు. అది జరిగింది ముంబైలో కాబట్టి అలియా హాజరుకావడంలో పెద్ద విశేషం లేదు. బాలీవుడ్ స్టార్స్ గా అలియా, అజయ్ దేవ్ గణ్ ప్రజన్స్ అక్కడ చాలా అవసరం.
అయితే హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల్లో నిర్వహించిన ప్రెస్ మీట్స్ లో కూడా అలియా విధిగా పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీకి భారీ ప్రచారం దక్కడంలో తన వంతు బాధ్యత నెరవేరుస్తున్నారు. నిజానికి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ప్రెస్ మీట్స్ లో అలియా పాల్గొనకున్నా వాటిల్లే నష్టం ఏమీ లేదు. కారణం.. అలియాకు సౌత్ లో అంతగా పాపులారిటీ లేదు. అయితే నార్త్ ప్రమోషన్స్ లో మాత్రం ఆమె కీలకం. కానీ అలియా సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ప్రతి చిన్న ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొంటున్నారు.
Also Read: విజయ్ దేవరకొండలో ఏం చూశారు బ్యూటీస్?… అందరూ ఆయనే కావాలంటున్నారు!
బాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న అలియా తన బిజీ షెడ్యూల్స్ పక్కనపెట్టి ఈ స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొనడం ప్రత్యేకత సంతరించుకుంది. అలియా జోరుగా ప్రచారంలో పాల్గొనడం వెనుక రాజమౌళి బలవంతం ఉందా.. లేక ఇది అలియా మంచి తనమా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రతి విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లే రాజమౌళి, అలియా ప్రమోషన్స్ లో పాల్గొనేలా మొదట్లోనే ఒప్పందం చేసుకొని ఉండవచ్చు.
అలా కాని పక్షంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొనాలని అలియా స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.ఇది అలియాకు కలిసొచ్చే అంశమే. బాలీవుడ్ లో టాప్ స్టార్ అయినప్పటికీ అలియాకు సౌత్ లో అంత ఫేమ్ లేదు. ఆర్ఆర్ఆర్ వంటి క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లో పాల్గొనడం ద్వారా సౌత్ లో ఇమేజ్ పెంచుకోవచ్చనే ఆలోచన కూడా కావచ్చు.
Also Read: స్క్రిప్ట్ మొత్తం ఇచ్చెయ్యమంటారా?.. మీడియాపై రాజమౌళి సెటైర్