Bandi Sanjay: బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఒక్క సారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో సమస్యలు పక్కనపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబడుతున్నారు.
ప్రజాసంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. తెలంగాణలో ఎలాగైనా అధికారం చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసమే అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి కొనసాగిస్తోంది. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తన పని తాను చేసుకుంటూ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారని కడిగేస్తున్నారు.
Also Read: YCP Leader Murdered: వైసీపీలో వర్గపోరు..దళిత నేత దారుణ హత్య
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తున్నారు. దీంతో భవిష్యత్ భయంకరంగా మారనుంది. జీవన గమనం మందగించనుంది. కానీ కేసీఆర్ మాత్రం తన పర్సంటేజీల కోసమే అప్పులు ఎడాపెడా చేస్తూ దోచుకుంటున్నారు. ఈ నేథ్యంలో ప్రజలు బిచ్చగాళ్లుగా మారే ప్రమాదముంది. దీన్ని అందరు గుర్తించి మంచి నిర్ణయం తీసుకుని రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరుతున్నారు.
బీజేపీ గెలిసిస్తే పెట్రో ధరలు తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు దిగి వచ్చేలా చేస్తామని భరోసా కల్పిస్తున్నారు. నీటి ప్రాజెక్టుల్లో లక్షల కోట్లు కుమ్మరించి ప్రజల నెత్తిన భారం మోపుతున్నారు. ఏపీలో రూ. 8 వేల కోట్లు, తెలంగాణలో రూ. 4 వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాలను అధోగతి పాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనిపై ప్రజలు చైతన్యవంతులై బీజేపీకి అధికారం కట్టబెట్టి అప్పుల్లో కూరుకుపోతున్న రాష్టాలను కాపాడాలని పేర్కొన్నారు.
Also Read:AP High Court: కోర్టు ధిక్కరణ కేసులో మరో ఐఏఎస్ కు జైలు