కేరళలోని పొల్లాచ్చిలో ఓ ప్రైవేటు పెట్రోల్ బంకులో ఓ యువతి (Girl) పని చేస్తోంది. రోజు చాలా మంది పెట్రోల్ కోసం వస్తూనే ఉంటారు. అలా వచ్చిన వారిలో ఓ బాలుడు కూడా ఉన్నాడు. దీంతో ఆమె కన్ను అతడిపై పడింది. ప్రేమలో దింపాలని చూసింది. మాటలు కలుపుతూ మచ్చిక చేసుకుంది. దీంతో అతడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూసేది. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ప్రేమ పుట్టింది. కాగా ఒకసారి అనారోగ్యం బారిన పడటంతో ఆస్పత్రిలో చేరాడు. దీంతో అతడిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లి హంగామా చేసింది.
అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక పెళ్లి చేసుకుందామని చెప్పింది. దీంతో అతడి మైండ్ బ్లాక్ అయింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆలోచిస్తానని చెప్పినా వినిపించుకోకుండా దగ్గరలోని గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంది. దీంతో విషయం కుర్రాడి తల్లిదండ్రులకు తెలియడంతో నివ్వెరపోయారు. జరిగిన తతంగంపై ఆరా తీశారు. మైనర్ ను ఎలా పెళ్లి చేసుకుంటుందని మండిపడ్డారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బాలుడిని పెళ్లి చేసుకోవడం నేరమని పోలీసులు తెలిపారు. అతడు మైనర్ కావడంతో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం పోస్కో చట్టం ప్రకారం నేరమని పేర్కొన్నారు. ఆమెను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. గతంలో కూడా ఇలాగే ఓ బాలుడిని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుందామని బలవంతం చేసినట్లు తెలిసింది. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణను ప్రేమగా భావించుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.