https://oktelugu.com/

బీజేపీపై జనసైన్యం ఫైర్‌‌.. ఓట్లు పడేనా..?

మొత్తానికి గ్రేటర్‌‌ హైదరాబాద్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ రిలీజ్‌ చేయడం జరిగిపోయింది.. ప్రచారం కాస్త ముగిసింది.. నేడు పోలింగ్‌ కూడా జరగబోతోంది. మరో మూడు రోజుల్లో ఫలితాలు కూడా తేలబోతున్నాయి. ఎన్నడూ లేనంత తీవ్ర పోటీ ఈసారి గ్రేటర్‌‌ కార్పొరేషన్‌లో కనిపిచింది. ముఖ్యంగా టీఆర్‌‌ఎస్‌, బీజేపీ పోటాపోటీ ప్రచారం నిర్వహించాయి. అయితే.. నామినేషన్ల సందర్భంలో తమ పార్టీ సైతం పోటీలో ఉంటుందని ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆ తర్వాతి పరిణామాలతో బీజేపీకి మద్దతు ప్రకటించారు. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 1, 2020 11:07 am
    Follow us on

    Janasena
    మొత్తానికి గ్రేటర్‌‌ హైదరాబాద్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ రిలీజ్‌ చేయడం జరిగిపోయింది.. ప్రచారం కాస్త ముగిసింది.. నేడు పోలింగ్‌ కూడా జరగబోతోంది. మరో మూడు రోజుల్లో ఫలితాలు కూడా తేలబోతున్నాయి. ఎన్నడూ లేనంత తీవ్ర పోటీ ఈసారి గ్రేటర్‌‌ కార్పొరేషన్‌లో కనిపిచింది. ముఖ్యంగా టీఆర్‌‌ఎస్‌, బీజేపీ పోటాపోటీ ప్రచారం నిర్వహించాయి. అయితే.. నామినేషన్ల సందర్భంలో తమ పార్టీ సైతం పోటీలో ఉంటుందని ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆ తర్వాతి పరిణామాలతో బీజేపీకి మద్దతు ప్రకటించారు.

    Also Read: హైదరాబాదీల మొద్దు నిద్ర.. ఓటు వేయట్లేదే?

    బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించినా.. ఆ పార్టీ లీడర్లను అక్కున చేర్చుకోవడంలో.. వారిని వినియోగించుకోవడంలో బీజేపీ ఫెయిలైనట్లుగా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ స్టేట్‌ చీఫ్‌, ఎంపీ ధర్మపురి అర్వింగ్‌ ఘోరంగా వైఫల్యం చెందారని విశ్లేషిస్తున్నారు. సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల జనసైనికుల బలం పరిమితమే అయినప్పటికీ, ప్రతి ఓటు కూడా విలువైన ఎన్నికలలో జనసేన మద్దతు పూర్తిస్థాయిలో పొందలేకపోవడం బీజేపీ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

    దుబ్బాక ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తల కంటే జనసైనికుల హవా ఎక్కువగా కనిపించింది. అయితే దుబ్బాక గెలిచిన తర్వాత బండి సంజయ్ జనసేన పార్టీని కరివేపాకులా తీసి పడేస్తూ మాట్లాడిన తీరు జనసేనకు కోపం తెప్పించింది. జనసేన పార్టీ కూడా కేవలం 18 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టడం జరిగింది. అయితే కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయి జనసేన అభ్యర్థులను పోటీ నుండి విరమించుకునేలా చేయగలిగారు. పవన్ కళ్యాణ్ స్వయంగా జనసేన బీజేపీకి మద్దతు ఇస్తుందని చేసిన ప్రకటన ఓ వైపు జనసైనికులను నిరాశపరిచింది.

    Also Read: ఈసారి కూడా టీఆర్ఎస్ సెంచరీ మిస్ అయినట్టేనా?

    అయినప్పటికీ.. రెండు పార్టీల మధ్య సఖ్యత కనిపించలేదు. నిన్నటి అమిత్ షా రోడ్ షో సందర్భంగా బీజేపీ జెండాలతో సమానంగా జనసేన జెండాలు ఎగురుతున్న వీడియోలతోపాటు, జనసైనికుల జెండాలు తీసివేయమని బండి సంజయ్ గదమాయిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేవిధంగా ధర్మపురి అరవింద్ ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ, జనసేనను విరమించుకోమని బీజేపీ కోర లేదని, పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా విరమించుకున్నారని వ్యాఖ్యలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన జనసైనికులు, బీజేపీ తరఫున కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు పవన్ తో భేటీ అయ్యారో చెప్పాలంటూ ఆయనని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అయితే ఈ రోజు ఎట్టకేలకు ఆయన జనసైనికులు మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రోడ్ షో లో వ్యాఖ్యానించారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఈ క్రమంలో జనసేన పార్టీ అభిమానులకు టీఆర్ఎస్ పట్ల కాస్త వ్యతిరేకత ఉంది. 2019 ఎన్నికల సందర్భంలో తమ పార్టీలో చేర్చుకున్న ముఖ్యనేతలను టీఆర్ఎస్ పార్టీ బెదిరించింది అని, జనసేనలో చేరితే హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులకు భద్రత ఉండదని పెట్టింది అని ఆరోపణలు వచ్చాయి. ఇలా రకరకాల కారణాలతో జన సైనికులకు టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంది. ఎలాగూ బీజేపీపై కోపంతో ఉన్నారు కాబట్టి.. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు కానీ లేదంటే నోటాకి కానీ వేయడం బెటర్ అన్న భావనలో చాలావరకు జనసైనికులు ఉన్నట్లు కనిపిస్తోంది.