https://oktelugu.com/

ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు..!

జీహెచ్ఎంసీ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. కరోనా నిబంధనలు.. చలిపులి ఓటింగ్ పై ప్రభావం చూపుతున్నట్లు కన్పిస్తోంది. ఉదయం 10గంటలు దాటినా కూడా పోలింగ్ మందకోడిగానే జరుగుతుంది. ఇప్పుడిప్పుడే నగరవాసులు పోలింగ్ స్టేషన్ కు తరలుతున్నాయి. ఇక ఎన్నికల్లో ఇప్పటికే కొందరు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ నందినగర్ పోలింగ్ బూత్‎లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడ పోలింగ్ కేంద్రంలో ఓటు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 1, 2020 / 10:30 AM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. కరోనా నిబంధనలు.. చలిపులి ఓటింగ్ పై ప్రభావం చూపుతున్నట్లు కన్పిస్తోంది. ఉదయం 10గంటలు దాటినా కూడా పోలింగ్ మందకోడిగానే జరుగుతుంది. ఇప్పుడిప్పుడే నగరవాసులు పోలింగ్ స్టేషన్ కు తరలుతున్నాయి. ఇక ఎన్నికల్లో ఇప్పటికే కొందరు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    మంత్రి కేటీఆర్ నందినగర్ పోలింగ్ బూత్‎లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శాస్త్రిపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటును వినియోగించుకున్నారు.

    ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి దంపతులు జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణలు ఫిల్మ్‎నగర్ క్లబ్‎లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

    రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక సైబరాబాద్ సీపీ సజ్జనార్.. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తమ ఓటును వినియోగించుకున్నారు. సీఎస్ సోమేష్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి రాజేంద్రనగర్ డివిజన్ లోని ఉప్పర్ పల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితోపాటు మరికొంత మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు కదులుతున్నారు.