Modi vs KCR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధ సాధ్యమవుతుంది. రెండెడ్లు ఒక్కటైతేనే బండి నడుస్తుంది. లేకపోతే నడవదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి కూడా ఇలాగే మారుతోంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం పాల్గొనకుండా ఒంటెద్దు పోకడ పోతున్నారు. దీంతో రాష్ట్రానికి ఇక నిధులు రావడం కష్టమేనని చెబుతున్నారు నిపుణులు. కేంద్రంతో పెట్టుకుంటే మనకే నష్టమని తెలియదా? ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ మధ్య ఇటీవల కాలంలో దూరం ఎక్కువవుతోంది.

కేంద్రంతో ఎంత సన్నిహితంగా ఉంటే అంత అభివృద్ధి చేసుకోవచ్చు. నిధులు రాబట్టుకోవచ్చు. కానీ ఎడమొహం పెడమొహంగా ఉంటే నిధుల మాట దేవుడెరుగు కష్టాలే చుట్టుముడతాయి. ఆ మధ్య భారత్ బయోటెక్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటే సీఎం కేసీఆర్ అనారోగ్య కారణాలు చూపి హాజరు కాలేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు కూడా రాలేదు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరుగుతోందనే వార్తలు వస్తున్నాయి.
మొన్న కరోనా నాలుగో దశ విస్తరణపై అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే కూడా పాల్గొనలేదు. ఇక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల సీజేలు, సీఎంలు హాజరయితే మన రాష్ర్టం నుంచి మంత్రి ఇంద్రవకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఇలా ప్రతి సమావేశానికి ఏదో సాకు చూపి తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాగైతే ఎవరికి నష్టం? రాష్ట్రానికే ఏ ఫండ్స్ రాకుండా పోతాయి. కేంద్రం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ రాష్ర్టం తలుచుకుంటే ఏం చేయలేదనే సంతి కేసీఆర్ కు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read: గోపాలపురం ఎమ్మెల్యేపై ప్రజలు దాడి చేయడానికి కారణాలేంటి?
అన్ని రాష్ట్రాలు స్నేహపూర్వకంగా వ్యవహరించి పనులు చేసుకుంటుంటే తెలంగాణ మాత్రం పీఎంనే దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది దీంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం గగనమే. అభివృద్ధి పనులు జరగడం కష్టమే. ఈ నేపథ్యంలో సీఎం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం మాత్రం కనిపించడం లేదు. సీఎం ప్రొటోకాల్ సైతం పాటించకుండా ఏదో చేస్తున్నట్లు నాటకాలు ఆడితే ఆయనకే చేటు అనే సంగతి తెలుసుకుంటే మంచిది.
భారత్ బయోటెక్ సందర్శనకు వచ్చినప్పుడు తనకు రావొద్దని సందేశం పంపినట్లు సీఎం కేసీఆర్ తెలపడంతో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ దీనికి కౌంటర్ ఇచ్చారు. పీఎంవో కార్యాలయం ఏ సందేశం పంపలేదని తేల్చారు. సీఎంవో నుంచే తనకు ఆరోగ్యం బాగా లేదని హాజరు కావడం లేదని సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు దీంతో దొంగ ఎవరో తెలిసిపోతోంది కదా. ఎందుకు ఇన్ని డ్రామాలు? ఎందుకంత మోసం? కేంద్రంతో సఖ్యత లేకపోతే సీఎం కేసీఆర్ కే నష్టమనే విషయం ఆయనకు తెలిసినా పట్టించుకోవడం లేదు.
Also Read: ఎరక్క వచ్చి ఇరుక్కుపోయి.. అభివృద్ధి పంచాయితీ వేళ కేసీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా!
[…] Also Read: మోడీ వర్సెస్ కేసీఆర్.. ఇద్దరి మధ్య గ్య… […]
[…] Also Read: మోడీ వర్సెస్ కేసీఆర్.. ఇద్దరి మధ్య గ్య… […]
[…] Also Read: మోడీ వర్సెస్ కేసీఆర్.. ఇద్దరి మధ్య గ్య… […]
[…] Also Read: మోడీ వర్సెస్ కేసీఆర్.. ఇద్దరి మధ్య గ్య… […]