May Day 2022: బతుకు చక్రం తిరగాలంటే శ్రమను పెట్టుబడి పెట్టాల్సిందే..ఇలా శ్రమను పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరూ కార్మికులే. అందమైన భవిష్యత్తును నిర్మించేందుకు కార్మికులు, కర్షకులు రెక్కలు ముక్కలు చేసుకుంటారు. వారి విలువ కట్టలేం. కడుపుమాడుతున్నా.. చేసే పనిని సక్రమంగా ఉండాలంటూ శ్రామికుడు తన జీవితాన్ని ధారపోస్తాడు. అయితే ప్రతీ కార్మికుడు ఎంత శ్రమకోర్చినా తగిన ఫలితం పొందడం లేదు. నాడు బానిస సంకెళ్లతో పెట్టుబడిదారుల కోరల్లో చిక్కుకున్న కార్మికుడు నేడు పెరిగిన ధరలతో బతుకు సాగడం కష్టంగా మారింది. మరోవైపు యథేచ్చగా కార్మిక శ్రమ దోపిడీ జరుగుతూనే ఉంది. నవ సమాజ నిర్మాణం కోసం పునాదులు వేసే కార్మికులకు గుర్తింపు నిచ్చేందుకు మే డేను ప్రతీ సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నారు. గత కాలంతో పోలిస్తే కార్మికుల జీవనం నేటి కాలంలో మెరుగుపడినప్పటికీ స్థిరమైన భవిష్యత్తు లేదు. కానీ వారి గుర్తింపునకు అనేక కార్మిక సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా కార్మిక దినోత్సవంపై ప్రత్యేక కథనం..

రోజుకు 16 నుంచి 18 గంటల పని..అందులోనూ బానిసత్వం.. దీనిని భరించలేని కొందరు చికాగో వేదికగా కార్మికులు తిరబడ్డారు. 1886 మే 1న కార్మికులు పోరాట బాట పట్టారు. వీరికి మద్దతుగా షికాగోలోని మార్కెట్ లో చాలా మంది ప్రదర్శన చేపట్టారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చాలా మంది కార్మికులు ప్రాణ త్యాగం చేశారు. ఈ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
1890 మే 1న బ్రిటన్ లోని హైడ్ పార్క్ లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటల మాత్రమే పని ఉండాలనేది వారి నినాదం. ఆ తరువాత అనేక యూరప్ దేశాల్లోనూ ఇదే నిరసనలు కొనసాగాయి. దీంతో పనిగంటలను 8 గంటలకు కుదించారు. కార్మికులు చేసిన ప్రాణ త్యాగానికి గుర్తుగా మే 1న కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మే డే అంటే అంతర్జాతీయ కార్మిక దినోత్సవమే కాదు.. ‘లాయల్టీ డే’ గా కూడా పిలుస్తున్నారు.

Also Read: మోడీ వర్సెస్ కేసీఆర్.. ఇద్దరి మధ్య గ్యాప్
ఇక 1900 నుంచి 1920 వరకు యూరప్ లోని ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడీ ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే1న నిరసన ప్రదర్శనలు జరిగేవి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మే డే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు. ఆ తరువాత కారలంలో మే 1ని నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు. హిట్లర్ పాలనలో ఈ రోజును జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకునేవారు. ఇటలీలో ముస్సోలిని, స్పెయిన్లోని జనరల్ ఫ్రాంకోలు మే డే న పైన అనేక ఆంక్షలను విధించారు.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత మే 1 ని సెలవు దినంగా ప్రకటించారు. అంతేకాకుండా చాలా దేశాల్లో కార్మికులకు అనుకూలంగా చట్టాలను రూపొందించారు. వారి కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ మేడే ను సెలవు దినంగా ప్రకటించారు. కార్మిక శ్రమను గుర్తించిన దేశ ప్రభుత్వాలు వారి శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయి. అయితే పనికి తగిన వేతనం లేదనే డిమాండ్ ఇప్పటికీ ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు.
Also Read: ఇన్నాళ్లు తిడితే పడే జనసేన.. ఇప్పుడు మీదపడిపోతోందేంటి?



[…] […]