
Ganesh Festivel:ఏపీలో వినాయకచవితి ఉత్సవాలకు అటు ప్రభుత్వం ఉత్సాహం చూపించడం లేదు. కరోనా పేరుతో బహిరంగ గణేష్ ఉత్సవాలకు అక్కడి ప్రభుత్వంతోపాటు హైకోర్టు కూడా నిషేధం విధించింది. ప్రైవేటు స్థలాల్లో తక్కువమందితో చేసుకునేందుకు నిర్ణయించారు. అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.
కరోనాతో సంవత్సరంన్నరగా మొహం వాచి ఉన్న ప్రజలకు ఊరటనిస్తూ తెలంగాణ ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసి స్వేచ్ఛనిచ్చింది. వినాయక ఉత్సవాలకు ఎలాంటి నిబంధనలు, నిషేధాలు, కట్టబాట్లను పెట్టలేదు. దీంతో తెలంగాణ ప్రజలంతా ఊరువాడ, పట్టణాల్లో ఘనంగా చవితి వేడుకలు, నవరాత్రులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగురాష్ట్రాల్లోనే ఫేమస్ అయిన హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దంటూ ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. తీర్పును పున: పరిశీలించాలని కోరారు.
తీర్పులో ప్రధానంగా 4 అంశాలను తొలగించాలని కోరారు. పాస్టర్ ఆఫ్ ప్యారీస్ తో తయారు చేసిన వినాయకులను వాడొద్దని.. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని ఆదేశించింది. దీంతో గందరగోళం నెలకొంది. ఎందుకంటే హైదరాబాద్ లో ప్రధాన నిమజ్జనం అంతా హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లోనే.. అందులో వద్దంటే మొత్తం గందరగోళమే. వినాయకులకు వేరే చోటు అంటూ లేదు. ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. దీంతో హైకోర్టు ఉత్తర్వులు శరాఘాతంగా మారియి. దీంతో తాజాగా జీహెచ్ఎంసీ కమిషనర్ హైకోర్టులో రివ్యూ పిటీషన్ వేశారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకపోతే కనీసం 6 రోజులు పడుతుందని.. ఇదెంతో వ్యయప్రయాసలు అని పేర్కొన్నారు.
ఇలా తెలంగాణ ప్రభుత్వం వినాయక నిమజ్జనాలకు, వేడుకలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి హైకోర్టు నిర్ణయాలనే సమీక్షించాలని కోరుతుంటే.. ఏపీ సర్కార్ మాత్రం కరోనా పేరుతో వేడుకలను నియంత్రించడంపై అక్కడి ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.