
సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం ఆయన రేపు యాదాద్రి వెళ్లాల్సి ఉండగా.. వాయిదా వేసుకున్నారు. అయితే ఈనెల 17న చినజీయర్ స్వామితో కలిసి యాదాద్రి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి.. ప్రారంభ తేదీపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం.. యాదాద్రి ఆలయ ప్రారంభానికి హాజరు కావాలని ప్రధాని మోదీని కోరిన విషయం తెలిసిందే.