Wild Bear Caught In Karimnagar: చీకటి అంటే ఎవరికైనా భయమే. చీకట్లో ఎటైనా ప్రయాణం చేయాలంటే వరకు పుడుతుంది. మరి ఈ చీకట్లో వింత ఆకారాలు కనిపిస్తే ఎలా ఉంటుంది. ఆకారం అటు ఇటు కదులుతూ ఇంకెలా ఉంటుంది. కాస్త ధైర్యం ఉన్నోళ్లను పక్కన పెడితే.. మిగతా వారు అయితే పరుగులు పెట్టాల్సిందే. కానీ ఆ నగరంలో గత కొన్ని రోజులుగా చీకట్లో ప్రయాణం చేసే వారికి ఇంత ఆకారాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అర్థరాత్రి సమయంలో ఇవి రోడ్లపైకి వచ్చి ఉండడంతో ప్రయాణికులకు ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనవుతుంది. అయితే గతంలోనూ ఇదే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మరోసారి అదే విధంగా ఉండడంతో అక్కడి ప్రాంతవాసులు భయంతో జీవనం గడుపుతున్నారు. ఇంతకీ చీకట్లో ఉండే ఆ వింత ఆకారాలు ఏంటి? ఆ నగరం ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర ప్రాంతంలో ఉన్న కరీంనగర్ జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న శివారు ప్రాంతాలు చీకటి పడగానే భయంతో వణికి పోతున్నాయి. వీటిలో శాతవాహన యూనివర్సిటీ దరిదాపుల్లో ఉన్న రేకుర్తి, విజయపురి కాలనీవాసులు కొన్ని రోజులుగా రాత్రి అయితే బయటకు రావడానికి వణికి పోతున్నారు. ఎందుకంటే రాత్రులు వీరికి వింత ఆకారాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ వింత ఆకారాలు అంటే ఏ దయ్యమో.. భూతమో.. కాదు అది ఒక జంతువు. అదే ఎలుగుబంటి.
ఈ ప్రాంతంలో ఎలుగుబంటి కొన్ని రోజులుగా ఇక్కడి వారికి నిద్రలేకుండా చేస్తుంది. ఎప్పుడు ఏ సమయంలో ఇది బయటకు వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. యూనివర్సిటీ దాదాపు చిట్ట అడవిలో ఉన్నట్లు ఉంటుంది. దీని చుట్టుపక్కల కొండలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రేకుర్తిలోనూ గుట్టలు ఉండడంతో ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ఎలుగుబండ్లు వస్తున్నాయి. గతంలో యూనివర్సిటీలో ఎలుగుబంటి సంచారం చేయడంతో ఇక్కడి విద్యార్థులు కొన్ని రోజులపాటు యూనివర్సిటీకి రాకుండా ఉండిపోయారు. అయితే అటవీ అధికారులు వలవేసి దానిని పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి ఐడియాలు.. ట్రాక్టర్ను ఏకంగా రోడ్డు రోలర్గా మార్చేశాడు
కానీ మళ్ళీ కొన్ని రోజులుగా రేకుర్తి, విజయపురి కాలనీ ప్రాంతాల్లో ఎలుగుబంటి సంసారం భయపడుతుంది. అయితే ఈ ఎలుగుబంటి ఎక్కువగా రాత్రి సమయంలోనే సంచరిస్తూ ఉండడంతో కొంతమంది ఈ వింత ఆకారం ఏంటో అని భయపడుతున్నారు. ఎలుగుబంటి చూడడానికి వెంట్రుకలతో నల్లగా ఉంటుంది. రాత్రి సమయంలో అది అటు ఇటు కదలడంతో అది ఏంటో తెలియక చాలామంది వణికిపోయారు. కొందరు రాత్రులు తమ ఇంటికి వచ్చేవారు ప్రయాణం చేయడానికి మానుకుంటున్నారు.
ఈ ప్రాంతంలో ఎలుగుబంటి సమస్య కొత్త కాదు. కానీ అటవీ శాఖ అధికారులు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే ఇలా జరుగుతుందని అంటున్నారు. ఇప్పటివరకు సంచరించిన ఎలుగుబండ్లను వలవేసి పట్టుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే ఎలుగుబంటి దాడితో గతంలో గాయాల పాలైన వారు ఉన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉండే ఈ ప్రాంతంలో ఎలుగుబంటి దాడి చేసే ప్రమాదం ఉందని అంటున్నారు.