https://oktelugu.com/

తమిళ పార్టీల ఎన్నికల మెనిఫెస్టో చూశారా..? ఉచిత వాషింగ్ మెషిన్

తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల కోలాహాలం మొదలైంది. త్వరలో ఇక్కడ సార్వత్రిక ఎన్నికల జరగనండడంతో ఆయా పార్టీలో మెనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. ఉచిత పథకాలకు వేదికగా నిలిచిన ఈ రాష్ట్రంలో ఇప్పుడు కూడా అన్నీ ఉచితం అంటూ పార్టీలు ప్రకటన చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఇటీవల మెనిఫెస్టోను విడుదల చేసింది. అందులో ప్రకటించిన పథకాలను చూసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పథకాలు అనుసరిస్తే తాము కూడా ఎన్నికల్లో గెలుస్తామా..? అన్న విధంగా ఆలోచిస్తున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 15, 2021 / 04:29 PM IST
    Follow us on

    తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల కోలాహాలం మొదలైంది. త్వరలో ఇక్కడ సార్వత్రిక ఎన్నికల జరగనండడంతో ఆయా పార్టీలో మెనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. ఉచిత పథకాలకు వేదికగా నిలిచిన ఈ రాష్ట్రంలో ఇప్పుడు కూడా అన్నీ ఉచితం అంటూ పార్టీలు ప్రకటన చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఇటీవల మెనిఫెస్టోను విడుదల చేసింది. అందులో ప్రకటించిన పథకాలను చూసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పథకాలు అనుసరిస్తే తాము కూడా ఎన్నికల్లో గెలుస్తామా..? అన్న విధంగా ఆలోచిస్తున్నారు.

    వాషిగ్ మిషన్.. ధీని ధర కనీసం రూ.20వేలకు పైగానే ఉంటుంది. అయితే అన్నాడీఎంకే గెలిస్తే ఈ వాషింగ్ మిషన్ ను రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తారట. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల రేషన్ కార్డు లబ్దిదారులున్నారు. వారందరికీ పంచితే ఎంతవుతుందో అర్థం చేసుకోవాలి. అధికార పార్టీ ఇవే కాకుండా ఇంకా మరిన్న ఉచిత పథకాలతో ఎన్నికల్లోకి వెళుతోంది. ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు, సోలార్ స్టౌలు ఉచితంగా పంపిణీ చేస్తుందట.

    విద్యార్థులకు 2 జీబీ డేటా ఫ్రీ, వృద్ధాప్య పింఛన్, విద్యా రుణాల మాఫీ, గృహిణులకు నెల నెలా రూ.1500, రూ. 25 వేల సబ్సిడీ ఎంజీఆర్ గ్రీన్ ఆటో, జర్నలిస్టులకు ఉచిత గృహాలు లాంటి పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఏపీలో ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పథకాన్ని కూడా అన్నా డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెడుతుందని తెలుపుతోంది. అంతకుముందు జయలలిత ప్రకటించిన ఉచిత పథకాల మాదిరిగా ఇప్పుడు ఆ పార్టీ నాయకులు సైతం అదే బాటలో వెళుతున్నారు.

    అటు ప్రధాన పార్టీల్లో ఒకటైన డీఎంకే సైతం ఉచిత పథకాలనుప్రవేశపెడుతోంది. తమిళనాడులో ఈ ఉచిత సాంప్రదాయం చాలా ఎన్నికల నుంచి వస్తోంది. అయితే ప్రజలు మాత్రం ఇలాంటి వాటికి తొందరగా అడిక్ట్ అవుతున్నారని రాజకీయ పార్టీలు తొందరగా గ్రహించాయి. మరి ప్రకటించిన ప్రకారం పథకాలను లబ్దిదారులకు అందిస్తారా.? లేదా..? అన్నది చూడాలి.