https://oktelugu.com/

RRR సినిమా చూసిన మెగాస్టార్‌.. రాజ‌మౌళితో ఏమ‌న్నాడంటే ?

అగ్ర ద‌ర్శ‌కుడు ఒక వైపు.. అగ్ర‌హీరోలు మ‌రోవైపు.. ఎంత ఖ‌ర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్న నిర్మాత ఇంకో వైపు.. వీరంతా కలిసి తెర‌కెక్కిస్తున్న అద్భుతం RRR. ఈ అద్భుతం కోసం యావ‌త్ దేశ‌మే కాదు.. ప్ర‌పంచంలోని సినీ ప్రేక్ష‌కులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే.. అలాంటి చిత్రాన్ని ముందుగానే వీక్షించారు మెగాస్టార్ చిరంజీవి! Also Read: RRRలో అలియాబ‌ట్ ఎలా ఉందో తెలుసా..? అవును.. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌ధాన‌మైన స‌న్నివేశాలు, ఒక‌పాట మిన‌హా దాదాపుగా RRR పూర్తికావొచ్చింది. […]

Written By:
  • Rocky
  • , Updated On : March 15, 2021 / 03:48 PM IST
    Follow us on


    అగ్ర ద‌ర్శ‌కుడు ఒక వైపు.. అగ్ర‌హీరోలు మ‌రోవైపు.. ఎంత ఖ‌ర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్న నిర్మాత ఇంకో వైపు.. వీరంతా కలిసి తెర‌కెక్కిస్తున్న అద్భుతం RRR. ఈ అద్భుతం కోసం యావ‌త్ దేశ‌మే కాదు.. ప్ర‌పంచంలోని సినీ ప్రేక్ష‌కులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే.. అలాంటి చిత్రాన్ని ముందుగానే వీక్షించారు మెగాస్టార్ చిరంజీవి!

    Also Read: RRRలో అలియాబ‌ట్ ఎలా ఉందో తెలుసా..?

    అవును.. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌ధాన‌మైన స‌న్నివేశాలు, ఒక‌పాట మిన‌హా దాదాపుగా RRR పూర్తికావొచ్చింది. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కూ కంప్లీట్ చేసిన మూవీని మెగాస్టార్ చూశార‌ట‌! ఈ చిత్ర బృందంతో క‌లిసి ఆయ‌న ప్ర‌త్యేకంగా ఈ చిత్రాన్ని వీక్షించార‌ట‌. ఈ రషెస్ చూసిన త‌ర్వాత రాజ‌మౌళితో త‌న ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడ‌ట‌.

    అయితే.. షూటింగ్ పూర్తి కాలేదు కాబ‌ట్టి.. చిరు చూసింది పూర్తిమూవీ కాదని తెలిసిందే. ఇంకా ప‌లు స‌న్నివేశాలు షూట్ చేయాల్సి ఉంది. ఫైన‌ల్ మిక్సింగ్ జ‌ర‌గాల్సి ఉంది. రీరికార్డింగ్ బ్యాలెన్స్‌ ఉంది. ఇవ‌న్నీ లేకుండానే సినిమా చూసిన చిరు.. రాజ‌మౌళిని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తాడ‌ట‌.

    Also Read: ఓవ‌ర్సీస్ లో దుమ్ములేపుతున్న జాతిర‌త్నాలు.. బ‌ద్ద‌లైపోతున్న బాక్సాఫీస్‌!

    RRR సినిమా బాహుబ‌లిని కూడా మించిపోయింది అని వ్యాఖ్యానించాడ‌ట మెగాస్టార్‌. వాస్త‌వంగా జ‌క్క‌న్న సినిమా కంప్లీట్ అయ్యే వ‌ర‌కూ ఎవ్వ‌రికీ ప్రీమియ‌ర్ వేయ‌డన్న సంగ‌తి తెలిసిందే. కానీ.. చిరుకాబ‌ట్టి వెంట‌నే ప్లాన్ చేసి చూపించాడ‌ట‌. అయితే.. ఏ సినిమా చూసినా దానిపై జెన్యూన్ ఫీలింగ్ చెప్తుంటాడు చిరు. ఈ మూవీపై కూడా ఇదే విధంగా స్పందించాడ‌ని అంటున్నారు.

    త‌ప్ప‌కుండా ఈ మూవీ భారీ హిట్ గా నిలుస్తుంద‌ని చెప్పాడ‌ట‌. మ‌గ‌ధీర విష‌యంలోనూ ఇదే విష‌యాన్ని చెప్పాడు చిరంజీవి. తాజాగా.. ఉప్పెన విష‌యంలోనూ ఇదేరిపీట్ అయ్యింది. మ‌రి, RRR సినిమా ఎలాంటి రిజ‌ల్ట్ న‌మోదు చేస్తుందో చూడాలి. ఈ మూవీ ద‌స‌రా కానుక‌గా.. అక్టోబ‌రు 13న రిలీజ్ కానున్న విష‌యం తెలిసిందే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్