https://oktelugu.com/

బాబును సొంత జిల్లాలో పడగొట్టేందుకు జగన్ ప్లాన్..!

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మంచి జోష్ మీదున్న వైసీపీ ఇక తదుపరి ఎన్నికపై దృష్టి సారించింది. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలోనూ వైసీపీ జెండా పాతేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ హఠాన్మరణం చెందారు. దీంతో ఉప ఎన్నికకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలయింది. ఇప్పటికే ఇక్కడ అధికార పార్టీ తరుపున ఓ అభ్యర్థినికి అనుకున్నారు. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. టీడీపీ అభ్యర్థినిక […]

Written By:
  • NARESH
  • , Updated On : March 15, 2021 / 05:33 PM IST

    chandrababu jagan

    Follow us on

    పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మంచి జోష్ మీదున్న వైసీపీ ఇక తదుపరి ఎన్నికపై దృష్టి సారించింది. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలోనూ వైసీపీ జెండా పాతేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ హఠాన్మరణం చెందారు. దీంతో ఉప ఎన్నికకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలయింది. ఇప్పటికే ఇక్కడ అధికార పార్టీ తరుపున ఓ అభ్యర్థినికి అనుకున్నారు. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. టీడీపీ అభ్యర్థినిక ప్రకటించగా, బీజేపీ సైతం రంగంలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది.

    తిరుపతి ఎంపీగా ఉన్న దుర్గాప్రసాద్ మరణంతో ఆయన కుమారుడికే టికెట్ ఇస్తారని అందరూ భావించారు. అయితే ఆయనను శాసనమండలికి పంపేందుకు రెడీ చేశారు. ఇక్కడ జగన్ ఫిజియోథెరఫీ వైద్యుడికి టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం. అటు టీడీపీ పనబాక లక్ష్మీ పేరును ఇప్పటికే తెలిపింది. ఇక బీజేపీ, జనసేనలు కలిసి ఎవరి అభ్యర్థులను నిలబెడుతారోనన్న సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో లాగానే ఇక్కడ కూడా వైసీపీ జెండా పాతేందుకు సిద్ధమవుతోంది.

    ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మంచిపట్టున్న విశాఖ జిల్లాలో వైసీపీ విజయం సాధించింది. ఇక్కడ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినా అధికార పార్టీ వ్యూహంతో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది. ఇక బాబు సొంత జిల్లాలోనూ పడగొట్టేందుకు జగన్ పెద్ద ప్లానే వేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో చంద్రబాబు, లోకేశ్ ప్రత్యక్షంగా ప్రచారం చేసిన అక్కడి స్థానాన్ని చేజిక్కించుకోలేకపోయారు. దీంతో తిరుపతిలో టీడీపీ ఎలాంటి ప్లాన్ వేస్తుందోనన్న ఆసక్తి మొదలైంది.

    వైసీపీ నాయకులు మాత్రం జగన్ ఇమేజ్ తోనే గెలుస్తామని అంటున్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తే వారు అధికార పార్టీ వెన్నంటే ఉంటారని నమ్మబలుకుతున్నారు. అయితే ఒకవేళ పరిస్థితిని,సర్వేను గమనించి వీలైతే జగన్ వచ్చి ప్రచారం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లుు తెలుస్తోంది. ఉప ఎన్నికల బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి, ఏడుగురు ఎమ్మెలపై పెట్టారు జగన్. వారు ఎలాగైనా తిరుపతి స్థానాన్ని గెలుచుకునేందుకు జగన్ ఇమేజ్ తోనే ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.