Free Bus
Free Bus : కూటమి ప్రభుత్వం( Alliance government) ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే వార్షిక బడ్జెట్లో సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపైన ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారుల నుంచి నివేదిక కోరింది. క్షేత్రస్థాయిలో ఈ పథకంపై కసరత్తు ప్రారంభం అయింది. ఈ పథకం అమలు దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది.
Also Read : మహిళలకు షాక్.. ఏపీలో ఆ పథకం ఇప్పట్లో లేనట్టే!
* ఆ రెండు చోట్ల సక్సెస్..
కర్ణాటకలో ( Karnataka) ఉచిత బస్సు ప్రయాణ పథకానికి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీంతో అక్కడ మహిళలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. అధికారంలోకి తీసుకు రాగలిగారు. తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ ఇదే హామీ ఇచ్చింది. ఇక్కడ కూడా అధికారంలోకి రాగలిగింది. అయితే ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబు సైతం ఇదే హామీ ఇచ్చారు ఏపీ మహిళలకు. ఇక్కడ కూడా మహిళలు ఆదరించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. కానీ ఇంతవరకు పథకం అమలు కాలేదు. మధ్యలో మంత్రుల కమిటీలు వివిధ రాష్ట్రాల్లో పథకం అమలు పరిశీలించడం, పూర్తిస్థాయి ఆరా తీయడం వంటివి జరిగిపోయాయి. ఇప్పుడు ఫైనల్ గా ప్రభుత్వం అధికారులకు నివేదిక కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
* ఫుల్ క్లారిటీ
మరోవైపు ఇటీవల శాసనమండలిలో( assembly Council ) మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాము ఇచ్చిన హామీ మేరకు మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు భారం, తీసుకోవాల్సిన చర్యల పైన అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంది. ఇప్పటికే తెలంగాణతో పాటు కర్ణాటకలో ఈ పథకం అమలవుతోంది. ఈ పథకం అమలు తీరుపై అధ్యయనం కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించారు. ఇప్పటికే పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మరోవైపు అధికారులు సైతం తమ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. పరిస్థితి చూస్తుంటే వీలైనంత త్వరగా పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉంది.
* అదనపు బస్సులు అవసరం
మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి అదనంగా 2000 కొత్త బస్సులు అవసరం అని అధికారులు అంచనా వేశారు. అదే సమయంలో ఆర్టీసీలో తగినంత సిబ్బంది లేరు. డ్రైవర్ల కొరత వేధిస్తోంది. 3500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. ఈ పథకంతో నెలకు ఆర్టీసీకి 250 నుంచి 260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కొత్త సంవత్సరం ఆరంభంలో ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ పథకం పై అధికారికంగా ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.
Also Read : కొత్త సంవత్సరంలో మహిళలకు ఉచిత బస్సు పథకం.. ముహూర్తం ఫిక్స్!