https://oktelugu.com/

Free Bus Scheme : మహిళలకు షాక్.. ఏపీలో ఆ పథకం ఇప్పట్లో లేనట్టే!

ఏపీలో మహిళలకు షాక్ తప్పడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం పథకాలు ప్రారంభమవుతాయని భావించారు. కానీ ఏ ఒక్కటీ ఇంతవరకు కార్యరూపం దాల్చడం లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : January 3, 2025 / 11:18 AM IST

    Free Bus Scheme

    Follow us on

    Free Bus Scheme :  ఈ ఎన్నికల్లో కూటమి గెలుపునకు చాలా కారణాలు దోహదపడ్డాయి. ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తారని ప్రజలు బలంగా నమ్మారు కూడా. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని నిలబెట్టుకునే విషయంలో కూటమి ప్రభుత్వం తడబడుతోంది. ఇప్పటివరకు సంక్షేమ పథకాలు పట్టాలెక్కలేదు సామాజిక పింఛన్లతో పాటు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ మినహా.. మరో పథకం అంటూ అమలు చేయలేదని విమర్శలు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో ఇచ్చిన పథకాలు పట్టాలెక్కడం లేదు. ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పై ఇప్పటికీ సరైన నిర్ణయం తీసుకోలేదు. తాము అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తామని కూటమి నేతలు బలంగా చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు విషయంలో మల్ల గుల్లాలు పడుతున్నారు. నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది. కానీ మహిళలకు ఉచిత ప్రయాణం పై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

    * కాలయాపనతో సరి
    సూపర్ సిక్స్ పథకాలలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మహిళలకు సంబంధించి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కర్ణాటకలో ఈ హామీ వర్కౌట్ అయ్యింది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో మహిళలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. అధికారంలోకి తీసుకొచ్చారు. తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ ఇదే హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి అమలు చేస్తోంది. ఏపీలో చంద్రబాబు ఇదే హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు కానీ అమలు చేయలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఉగాదిని డెడ్ లైన్ గా పెట్టుకున్నారు.

    * జూన్ తర్వాతే
    ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం హామీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలు చేస్తామని వచ్చారు. కానీ అమలు విషయానికి వచ్చేసరికి విఫలమయ్యారు. ఇప్పుడు ఈ ఏడాది ఈ పథకం అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పథకం అమలు చేయాలంటే కనీసం 1000 అదనపు బస్సులు అవసరం. అదనపు సిబ్బందిని సైతం నియమించాలి. మరోవైపు అన్నదాత సుఖీభవ తో పాటు తల్లికి వందనం పథకం అమలు చేయాలని చూస్తున్నారు. ఈ రెండు పథకాలకు భారీగా నిధులు అవసరం. అందుకే మహిళల ఉచిత ప్రయాణాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ పథకం ఉగాదికైనా పట్టాలెక్కుతుందా? లేకుంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదా? అన్నది తెలియాలి.