మత్స్యకారుల ఘోష వినండి!:పవన్

దేశంలో కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించడంతో గుజరాత్‌ లో నాలుగు వేల మంది మత్స్యకారులు చిక్కుకుపోయారు. వారిని ఏపీకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. లాక్‌ డౌన్ కారణంగా గుజరాత్‌ లో నాలుగు వేల మంది మత్స్యకారులు చిక్కుకుపోయారని అన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని వారందరినీ రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని పవన్ కోరారు. […]

Written By: Neelambaram, Updated On : April 18, 2020 8:26 pm
Follow us on

దేశంలో కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించడంతో గుజరాత్‌ లో నాలుగు వేల మంది మత్స్యకారులు చిక్కుకుపోయారు. వారిని ఏపీకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. లాక్‌ డౌన్ కారణంగా గుజరాత్‌ లో నాలుగు వేల మంది మత్స్యకారులు చిక్కుకుపోయారని అన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని వారందరినీ రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని పవన్ కోరారు. కనీసం సంబంధిత జిల్లా మంత్రులు, అధికారులను అయినా గుజరాత్‌ కు పంపించి.. అక్కడ చిక్కుకున్న మత్స్యకారులకు భరోసా ఇవ్వాలన్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా వారందరినీ రాష్ట్రానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు.