https://oktelugu.com/

లాక్ డౌన్ లో ఉద్యోగుల్ని తొలగించొద్దంటున్న కేటీఆర్

రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్, ఐటీశాఖ శాఖ మంత్రి కేటీఆర్ భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. లాక్డౌన్ అనంతరం పరిస్థితులు మళ్లీ మూములు స్థితికి చేరుకుంటాయన్నారు. ఈలోపు ఐటీ ఉద్యోగులకు తొలగించే చర్యలు చేపట్టొద్దని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వారికి ఆయన లేఖ కూడా రాశారు. కరోనా ప్రభావంతో ప్రస్తుతం అన్నిరంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. త్వరలోనే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 18, 2020 / 07:34 PM IST
    Follow us on


    రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్, ఐటీశాఖ శాఖ మంత్రి కేటీఆర్ భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. లాక్డౌన్ అనంతరం పరిస్థితులు మళ్లీ మూములు స్థితికి చేరుకుంటాయన్నారు. ఈలోపు ఐటీ ఉద్యోగులకు తొలగించే చర్యలు చేపట్టొద్దని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వారికి ఆయన లేఖ కూడా రాశారు.

    కరోనా ప్రభావంతో ప్రస్తుతం అన్నిరంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. త్వరలోనే ఐటీ రంగం మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాలే తప్ప ఉద్యోగులు, సిబ్బందిని తగ్గించే ప్రయత్నం చేయద్దని సూచించారు. ఉద్యోగులపై కంపెనీలు ఉదారతతో వ్యవహరించాలని కోరారు. రెగ్యూలర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులెవరినీ తీసేయొద్దని కేటీఆర్ సూచించారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక వ్యవస్థ పురోగమనంపై ప్రతినిధులతో చర్చలు జరిపారు.

    మరోవైపు రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేష్ ఖుమార్, డీజీపీ మహేందర్ పాల్గొన్నారు. ఏప్రిల్ 20న లాక్డౌన్ సడలింపు నేపథ్యం, ఆదివారం నిర్వహించే క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలపై సమీక్ష జరిపారు.