మోదీపై నోరు జారిన పాక్ ప్రధానికి మీడియా చివాట్లు

అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ పై, ముఖ్యమంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎగతాళిగా విసురు విసురుతూ ఉండే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు తాజాగా చేసిన అటువంటి ప్రయత్నం వికటించింది. మోదీ వ్యాఖ్యలకు తప్పుడు భాష్యం చెప్పడంతో ఆ దేశంలోని పత్రికలే ఆయనకు సున్నితంగా చివాట్లు పెట్టాయి. క‌రోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రధానై మోదీ మూడు వారల పాటు లాక్‌డౌన్ అమలుచేస్తుండ‌గా, పాక్‌లో మాత్రం ఆంక్ష‌ల‌తో స‌రిపెట్టుకొంటూ విమర్శలకు గురవుతున్నారు. పాకిస్థాన్‌లో ఇప్ప‌టికి […]

Written By: Neelambaram, Updated On : April 1, 2020 11:33 am
Follow us on

అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ పై, ముఖ్యమంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎగతాళిగా విసురు విసురుతూ ఉండే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు తాజాగా చేసిన అటువంటి ప్రయత్నం వికటించింది. మోదీ వ్యాఖ్యలకు తప్పుడు భాష్యం చెప్పడంతో ఆ దేశంలోని పత్రికలే ఆయనకు సున్నితంగా చివాట్లు పెట్టాయి.

క‌రోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రధానై మోదీ మూడు వారల పాటు లాక్‌డౌన్ అమలుచేస్తుండ‌గా, పాక్‌లో మాత్రం ఆంక్ష‌ల‌తో స‌రిపెట్టుకొంటూ విమర్శలకు గురవుతున్నారు.

పాకిస్థాన్‌లో ఇప్ప‌టికి 1,740 క‌రోనా పాజిటివ్ కేసులు, 18 మంది మృతి చెందినా కూడా అక్క‌డ పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌లేదు. ఈ పరిస్థితుల్లో పాక్‌లోని అనేక రాష్ట్రాలు.. భారత్ తరహాలో దేశాన్ని లాక్ డౌన్ చేయాలనే యోచనలో ఉన్నాయి. ఈ యోచనను పాక్‌ మీడియా కూడా సమర్థిస్తోంది.

ఈ విషయమై పాక్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఇమ్రాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న అవ‌గాహ‌నా రాహిత్యాన్నిమ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లు చేశాయి. భార‌త్‌లో లాక్‌డౌన్ విష‌యంలో మోదీ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని, లాక్‌డౌన్ విధిస్తే ఎంత‌టి త‌ప్పు నిర్ణ‌య‌మో త‌న‌కు తెలుసున‌ని ఇమ్రాన్ తన గురించి గొప్పగా చెప్పుకోవడం చూసి ఆ దేశ ప్రజలు విస్తు పోయారు. ఇమ్రాన్ వ్యాఖ్య‌ల‌ను ఆ దేశ మీడియానే త‌ప్పుబట్టింది.

భారత ప్రధాని మాట్లాడింది పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడ‌టం స‌రికాద‌ని హితవు చెప్పింది. మోదీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారా అంటూ ఇమ్రాన్ ఖాన్‌పై దుమ్మెత్తిపోసింది. లాక్ డౌన్ చేసినందుకు మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పలేదని, దీని వల్ల వారు ఇబ్బందులు పడుతున్నందుకు మాత్రమే క్షమాపణలు చెప్పారని ఆధారాలతో సహా చూపించింది.

మోదీ వ్యాఖ్య‌ల‌ను పూర్తిగా అర్థం తెలుసుకుని మాట్లాడితే బాగుండేద‌ని హిత‌వు ప‌లికింది. దానితో ఇమ్రాన్ కు ఇక మాటలు వచ్చిన్నట్లు లేదు.