దేశంలో కరోనా విజృంభన నేపథ్యంలో పీఎం-కేర్స్ కు రూ.35వేల విరాళం ఇచ్చిన మాజీ ఎంపీని బెయిల్ పై విడుదల చేసిన ఘటన ఝార్ఖండ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..ఝార్ఖండ్ లోని రాజమహల్ నియోజక వర్గంలో భాజపా మాజీ ఎంపీ సోమ్ మరండీ 2012లో నిర్వహించిన రైల్ రోకో కేసులో దోషిగా తేలారు. దీనిపై విచారణ చేపట్టిన సహిబ్ వ్గంజ్ రైల్వే జుడీషియల్ మేజిస్ట్రేట్.. ఆయనతో పాటు మరో ఐదుగురికి ఒక సంవవత్సరం పాటు సాధారణ జైలు జీవితం గడపాలని శిక్ష ఖరారు చేశారు. ఒకవేళ బెయిల్ కావాలంటే పీఎం-కేర్స్ కు రూ.35,000 విరాళం సహా, ఆరోగ్య-సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటేనే బెయిల్ ఇస్తామని, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని న్యాయమూర్తి షరతులు విధించారు. దీన్ని అంగీకరించి ఇటు బెయిల్ పొందడంతో పాటు.. కరోనాపై పోరులో భాగం కావాలన్న ప్రధాని మోదీ పిలుపును సైతం అందిపుచ్చుకున్నారు. న్యాయమూర్తి షరతులను అంగీకరిస్తూ.. జైలు జీవితం నుంచి విముక్తితో పాటు కొవిడ్-19పై పోరులో భాగమయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు.