తల్లి నీ ప్రేమకు వందనం.. భావోద్వేగానికి గురైన పోలీస్ బాస్

దేశంలో కరోనా వైరస్ ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. తొలివిడత లాక్డౌన్ ఈనెల 14తో ముగియగానే రెండో విడుత లాక్డౌన్ మే 3వరకు పొడగిస్తున్న ప్రధాని ప్రకటించిన సంగతి తెల్సిందే. కరోనా నివారణలో పోలీసులు, వైద్య సిబ్బంది కృషి మరువలేనిది. కరోనా ఎఫెక్ట్ తో పోలీసులు రోడ్లపైనే విధులు నిర్వహించాల్సి వస్తోంది. మండుటెండలను కూడా లెక్కచేయకుండా పోలీసులు రోడ్లపైనే బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు. కాగా విధుల్లో ఉన్న పోలీసులకు చూసిన ఓ పేద మహిళ వారికి […]

Written By: Neelambaram, Updated On : April 18, 2020 7:19 pm
Follow us on


దేశంలో కరోనా వైరస్ ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. తొలివిడత లాక్డౌన్ ఈనెల 14తో ముగియగానే రెండో విడుత లాక్డౌన్ మే 3వరకు పొడగిస్తున్న ప్రధాని ప్రకటించిన సంగతి తెల్సిందే. కరోనా నివారణలో పోలీసులు, వైద్య సిబ్బంది కృషి మరువలేనిది. కరోనా ఎఫెక్ట్ తో పోలీసులు రోడ్లపైనే విధులు నిర్వహించాల్సి వస్తోంది. మండుటెండలను కూడా లెక్కచేయకుండా పోలీసులు రోడ్లపైనే బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు. కాగా విధుల్లో ఉన్న పోలీసులకు చూసిన ఓ పేద మహిళ వారికి చల్లటి కూల్ డ్రింక్స్ అందించే ప్రయత్నం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన ఏపీ పోలీస్ బాస్ భావోద్వేగానికి గురై ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

ఈమేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆమెతో వీడియో కాన్ఫరెన్లో మాట్లాడారు. మీ అమ్మతనానికి ముగ్ధుడిని అయ్యానని చెప్పారు. మీతోనే తానే స్వయంగా మాట్లాడాలకున్నానని చెప్పారు. మీరు చేసిన తనను కదలించిందని చెబుతూ ఆ మహిళకు డీజీపీ సెల్యూట్ చేశారు. అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సహచర పోలీసులు చప్పట్లు కొట్టు హర్షం వెలిబుచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం ఆమె పేరు లోకమణి. ఆమె తూర్పు గోదావరి జిల్లాలోని తునిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పని చేస్తుంది. రోడ్లపై విధులను చేస్తున్న పోలీసులకు ఆమె కూల్ డ్రింక్ అందించేందుకు ముందుకొచ్చింది. అతితక్కువ వేతనంతో పనిచేస్తున్న ఆ మహిళ తమకు కూల్ డింక్స్ తెచ్చివ్వడంపై పోలీసులు చలించిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ డీజీపీ ఆమెతో వీడీయో కాన్ఫరెన్స్ తో ప్రత్యేకంగా మాట్లాడి ప్రశంసించారు. మీలాంటి వారి రక్షణ కోసమే పోలీసులు రేయింబవళ్లు పని చేస్తున్నారని తెలిపారు. డీజీపీ ఆమె సెల్యూట్ చేయగా.. లోకమణి చేతులు జోడించి నమస్కరించారు. ఆమె స్వచ్ఛమైన నవ్వు చూసి డీజీపీ కూడా ఫిదా అయ్యారు. ఇదే వీడీయోను టీడీపీ నేత నారా లోకేష్ ట్వీటర్లో పోస్టు చేసి ఆమె చేసిన సాయంపై ప్రశంసలు కురిపించారు. ఆమె సాయాన్ని వెలకట్టలేమని ప్రశంసించారు.