సూపర్ స్టార్ సరసన సాహో బ్యూటీ!

సాహో మూవీలో ప్రభాస్ కు జోడీగా నటించిన శ్రద్ధకపూర్ తెలుగులో మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకుడు పర్శురాం కాంబినేషన్లో తెరకెక్కే మూవీలో ఈ బ్యూటీని ఫైనల్ చేసినట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. సాహోలో ప్రభాస్ కు జోడీగా నటించి మెప్పించిన ఈ బాలీవుడ్ బ్యూటీగా తాజాగా మహేష్ తో రోమాన్స్ చేసేందుకు రెడీ అవుతుండటం ఆసక్తిని రేపుతోంది. పోలీసుల దాష్టికానికి యువకుడు మృతి! మహేష్ బాబు ఇటీవలే ‘సరిలేరునీకెవ్వరు’ […]

Written By: Neelambaram, Updated On : April 20, 2020 3:17 pm
Follow us on


సాహో మూవీలో ప్రభాస్ కు జోడీగా నటించిన శ్రద్ధకపూర్ తెలుగులో మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకుడు పర్శురాం కాంబినేషన్లో తెరకెక్కే మూవీలో ఈ బ్యూటీని ఫైనల్ చేసినట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. సాహోలో ప్రభాస్ కు జోడీగా నటించి మెప్పించిన ఈ బాలీవుడ్ బ్యూటీగా తాజాగా మహేష్ తో రోమాన్స్ చేసేందుకు రెడీ అవుతుండటం ఆసక్తిని రేపుతోంది.

పోలీసుల దాష్టికానికి యువకుడు మృతి!

మహేష్ బాబు ఇటీవలే ‘సరిలేరునీకెవ్వరు’ మూవీతో ఇండస్ట్రీ హిట్టందుకున్నాడు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల రికార్డులను తిరగరాసింది. ఈ మూవీ సక్సస్ ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు ఫ్యామిలీతో కొన్ని రోజులు విదేశాలకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత వంశీపైడిపల్లి దర్శకత్వంలో మూవీ వస్తుందకున్నప్పటికీ స్ర్కీప్ట్ కుదరలేదు. ఈ మధ్యలో దర్శకుడు పర్శురాం మహేష్ ఓ కథ విన్పించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా తగ్గుముఖం పట్టాక ఈ మూవీని ప్రారంభించేందుకు దర్శకుడు పర్శురాం ఇప్పటికే సన్నహాలు చేసినట్లు తెలుస్తోంది.

విజయసాయిరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధిగా మారారా!

ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ హీరోయిన్ తీసుకునేందుకు దర్శకుడు పర్శురాం మొగ్గు చూపుతున్నారు. ఈమేరకు పలువురు బాలీవుడ్ భామల పేర్లు తెరపైకి వచ్చాయి. కియారా అడ్వాణీ పేరు తెరపైకి వచ్చినా మహేష్ పక్కన కొత్త భామ అయితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడట. దీంతో సాహోలో ప్రభాస్ పక్కన నటించిన శ్రద్ధ కపూర్ ను తీసుకునేందుకు ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. మహేష్ తో రోమాన్స్ చేసేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా శ్రద్ధాకపూర్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.