Champai Soren: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం.. కారణం ఇదే!

హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత చంపాయ్ సోరెన్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఐదు నెలలు ఈ పదవిలో కూర్చుకున్నారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి వచ్చి సీఎం పగ్గాలు చేపట్టడానికి ఒక రోజు ముందు సీఎం పదవి తిరిగి అప్పగించారు. చంపాయ్ సోరెన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Written By: Neelambaram, Updated On : July 9, 2024 2:53 pm

Champai Soren

Follow us on

Champai Soren: హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ కేబినెట్ లో మాజీ సీఎం చంపాయ్ సోరెన్ రాంచీలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రిగా సోమవారం (జూలై 08)న ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 4న జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకరోజు ముందు అంటే జూలై 3 (బుధవారం) చంపాయ్ సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు .

హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత చంపాయ్ సోరెన్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఐదు నెలలు ఈ పదవిలో కూర్చుకున్నారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి వచ్చి సీఎం పగ్గాలు చేపట్టడానికి ఒక రోజు ముందు సీఎం పదవి తిరిగి అప్పగించారు. చంపాయ్ సోరెన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రులుగా ప్రమాణం చేయడంలో చంపాయ్ సోరెన్‌తో పాటు బైద్యనాథ్ రామ్, బాబీ దేవి, మిథిలేష్ ఠాకూర్, దీపక్ బిరువా, హఫీజుల్ హసన్‌తో సహా పలువురు జార్ఖండ్ ముక్తి మోర్చా ( JMM ) నాయకులు ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన నాయకులు రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, ఇర్ఫాన్ అన్సారీ, దీపికా పాండే సింగ్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నాయకుడు సత్యానంద్ భోక్తా కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. హేమంత్ సోరెన్ ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌లో ఫ్లోర్ టెస్ట్‌లో విజయం సాధించడం ద్వారా తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు. 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన విశ్వాస తీర్మానాన్ని సాధించారు. జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ జూలై 4న రాంచీలోని రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

జూన్ 28న బిర్సా ముండా జైలు నుంచి విడుదలైన తర్వాత హేమంత్ సోరెన్ తిరిగి తన సీఎం పదవిని దక్కించుకోగలిగారు. భూ కుంభకోణం, మనీ లాండరింగ్‌కు సంబంధించి ఆరోపణలపై 2024, జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) హేమంత్ సోరెన్ ను అరెస్టు చేసింది. 5 నెలల పాటు జైలులో ఉంచింది. అరెస్టుకు ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.

తనపై బీజేపీ తప్పుడు ఆరోపణలు చేసిందని హేమంత్ సోరెన్ ఓ వీడియో సందేశంలో ఆరోపించారు. ‘2019 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ప్రజలు మా పార్టీకి పాలనా పగ్గాలు అప్పగించారు. కానీ ఒక ఆదివాసీ యువకుడు ఇంత ఉన్నత స్థానంలో ఎలా కూర్చోగలుగుతాడని కుట్రదారులు జీర్ణించుకోలేకపోయారు. తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపించారు. ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఐదు నెలలకు బయటకు వచ్చాను అని హేమంత్ సోరెన్ అన్నారు.

2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో JMMతో కాంగ్రెస్, RJD పొత్తు పెట్టుకుంది, 81 మంది సభ్యుల శాసనసభలో 47 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ ను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.