Homeఎంటర్టైన్మెంట్Jabardasth Apparao: జబర్దస్త్ అప్పారావు ఆ సూపర్ హిట్ మూవీలో హీరోగా చేయాల్సిందా... ఒక్క కారణంతో...

Jabardasth Apparao: జబర్దస్త్ అప్పారావు ఆ సూపర్ హిట్ మూవీలో హీరోగా చేయాల్సిందా… ఒక్క కారణంతో రిజెక్ట్!

Jabardasth Apparao: జబర్దస్త్ షో వేదికగా ఫేమస్ రాబట్టిన కమెడియన్స్ లో అప్పారావు ఒకరు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో నవ్వులు పూయిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ కి రాకముందు అప్పారావు చాలా సినిమాల్లో నటించాడు. దాదాపు 100 పైగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. కానీ ఆయనకు గుర్తింపు లభించలేదు. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ దక్కింది. చాలా కాలం పాటు జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ నవ్వించిన అప్పారావు, అనూహ్యంగా ఈ షో కి దూరమయ్యారు.

ప్రస్తుతం పలు బుల్లితెర షోలతో పాటు సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. తాజాగా అప్పారావు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సంపూర్ణేష్ బాబు నటించిన హృదయ కాలేయం సినిమాలో మొదట ఆయన్ని హీరోగా అనుకున్నారని చెప్పి షాక్ ఇచ్చారు. అప్పారావు మాట్లాడుతూ .. నేను జబర్దస్త్ కి రాకముందు దాదాపు 50 కి పైగా సినిమాల్లో నటించాను.

కానీ అప్పడు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే జబర్దస్త్ షోకి వచ్చిన తర్వాత వందకు పైగా సినిమాల్లో నటించాను. ఏ వేషం ఉన్నా ఫోన్ చేసి పిలుస్తున్నారు. అంతలా జబర్దస్త్ నాకు పేరు తెచ్చింది. ‘ వేర్ ఈజ్ విద్యాబాలన్ ‘ అనే సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో నేను హీరో సంపూర్ణేష్ బాబుకు అసిస్టెంట్ రోల్ చేశాను. ఆ టైంలో ఆయన నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. సంపూర్ణేష్ బాబు నాతో… బాబాయ్, హృదయ కాలేయం సినిమాకు ఫస్ట్ మిమ్మల్ని హీరోగా అనుకున్నారు అని చెప్పాడు.

హృదయ కాలేయం సినిమాలో నన్నే హీరోగా అనుకున్నారట. కానీ నేను చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించాను. ఈ కారణంగా నాకు ఆ ఆఫర్ ఇవ్వకూడదని, కొత్త వారైతే బాగుంటుందని అనుకున్నారట. అలా ఆ అవకాశం నా చేయిజారిపోయింది అని అప్పారావు చెప్పుకొచ్చారు. హృదయ కాలేయం మూవీ సూపర్ హిట్ కొట్టింది. సంపూర్ణేష్ బాబు ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ చిత్రానికి బేబీ ఫేమ్ సాయి రాజేష్ దర్శకుడు. హృదయ కాలేయం మూవీ చూసిన జనాలు కొడతారని భయపడిన సాయి రాజేష్.. స్టీవెన్ శంకర్ అని మారు పేరు పెట్టుకుని మూవీ విడుదల చేశాడు. హృదయ కాలేయం సక్సెస్ సంపూర్ణేష్ బాబుకు అనేక ఆఫర్స్ తెచ్చిపెట్టింది.

Exit mobile version