Kumbh Mela : ఒకేసారి ప్రయాణికులను అనుమతించడం.. రైల్వే ప్లాట్ ఫారాల నెంబర్లు మారాయని చెప్పడంతో ఒకసారిగా ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఫలితంగా రైల్వే బ్రిడ్జిపై ఒకేసారి జనం తోసుకురావడంతో 18 మంది దుర్మరణం చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతదేహాలను ఢిల్లీ రైల్వే అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాయపడిన వారికి ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోవడంతో రైల్వే శాఖ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వ్యక్తం అవుతున్నాయి..” రైల్వే శాఖను ఆధునికీకరిస్తామని చెప్పారు. మీ దృష్టిలో ఆధునికీకరణ అంటే ఇదేనా? వందే భారత్, బుల్లెట్ రైళ్లు నడుపుతామని చెబుతున్న మీరు.. ముందు జనరల్ బోగీల సంఖ్యను పెంచుకోవడం నేర్చుకోండి. రైళ్ళో జనరల్ బోగీలు లేనప్పుడు 1500 మందికి టికెట్లు ఎలా ఇచ్చారు? వారు ఎలా ప్రయాణం చేయాలననుకున్నారు? ఇలా ఇబ్బంది పెట్టి ఏం చేద్దాం అనుకున్నారు? మీ నిర్వాకం వల్ల 18 మంది అమాయకులు కన్నుమూశారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకొకటి ఉంటుందా? తప్పు మీరు చేసి.. అదంతా ప్రయాణికుల లోపమే అని వ్యాఖ్యానిస్తారా” అంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ ఏమన్నారు అంటే
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ” న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతికి రైల్వే శాఖ బాధ్యత వహించాలి. ఆ తప్పు మొత్తం రైల్వే శాఖ దే. ఇలా తొక్కిసలాట జరగడం అత్యంత బాధాకరం. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. మహా కుంభమేళా నిర్వహించడంలో అసలు అర్థమే లేదు. అది పనికిరానిది.. భక్తులకు సౌకర్యాలు కల్పించ లేదు. అందువల్లే ఇలాంటి ఘటనలు జరిగాయి. 18 మంది ప్రయాణికులు చనిపోయారు అంటే రైల్వే శాఖలో ఇసుమంత కూడా చలనం లేకపోవడం దారుణమని” లాలూప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. లాలు చేసిన వ్యాఖ్యల పట్ల బిజెపి నాయకులు మండిపడుతున్నారు.. కుంభమేళకు హాజరయ్యే భక్తుల మనోభావాలను అవమానించిన లాలు ప్రసాద్ యాదవ్ క్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ” లాలూ ప్రసాద్ యాదవ్ కు మతి తప్పినట్టుంది. అందువల్లే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు. ఇలాంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా పనిచేశారంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. ప్రయాణికులను కావాలని ఇబ్బంది పెట్టరు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ప్రమాదవశాత్తు ఆ ఘటన జరిగింది కాబట్టి దానికి మేం కూడా చింతిస్తున్నాం. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించాం. ఇందులో ఎవరిదైనా ప్రమేయం ఉందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని” బిజెపి నాయకులు పేర్కొన్నారు.
ఢిల్లీ లో జరిగిన తొక్కిసలాట బాధాకరమైన ఘటన. అసలు కుంభమేళా నిర్వహించడమే వృధా ప్రయాస. దానిని ఎందుకు నిర్వహిస్తున్నారో.. ఎంతకీ అంతు పట్టడం లేదు.
*విలేకరులతో లాలూ ప్రసాద్ యాదవ్*#LaluPrasadYadav #MahakumbhStampede #trainaccident #NewDelhiRailwaystation pic.twitter.com/JROjK0BenZ— Anabothula Bhaskar (@AnabothulaB) February 16, 2025