Ramoji Rao: ప్రపంచానికే తలమానీకంగా రామోజీరావు రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. వేలాది ఎకరాలను సేకరించి అన్ని హంగులతో స్టూడియో కట్టారు. దేశవ్యాప్తంగా తమ మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించారు. బాలివుడ్, కోలివుడ్, టాలివుడ్..ఇలా అన్ని రాష్ట్రాల సినిమా షూటింగుల వేదికగా రామోజీ ఫిల్మ్ సిటీని తీర్చదిద్దారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ఆయన అభినందనలు అందుకుంటారు. అటువంటిది చిన్నపాటి రహదారిని సొంతం చేసుకునేందుకు 40 సంవత్సరాలు పట్టింది. వింతగా ఉంది కదూ. నిజమేనండీ విశాఖలో నాలుగైదు సెంట్ల విస్తీర్ణంలో ఉన్న రోడ్డు దక్కించుకునేందుకు మీడియా దిగ్గజం చేయని ప్రయత్నమంటూ లేదు. నాలుగు దశాబ్దాల అనంతరం ఆయన కల ఫలించింది.
కమ్మ ప్రముఖుల ముందుచూపు..
సాగర నగరం విశాఖలో చాలా మంది ప్రముఖులకు విలువైన ఆస్తులున్నాయి. ముందుచూపుతో వ్యవహరించిన చాలా మంది ఇక్కడ ఆస్తులు కూడాబెట్టారు. ఫైవ్ స్టార్ హోటళ్లు, సినిమా థియేటర్లు వంటివి నిర్మించుకున్నారు. లాభసాటి వ్యాపార మార్గాలను ఎంచుకున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల్లో భాగంగా విశాఖ పాలనా రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సామాజికవర్గం విశాఖలో ఎంటరైనట్టు టాక్ వినిపిస్తోంది. అన్ని లాభసాటి వ్యాపారాల్లో వారు విస్తరణకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులకు మూడు దశాబ్ధాల ముందు నుంచే ఇక్కడ విలువైన ఆస్తులన్నాయి. మీడియా దిగ్గజం రామోజీరావుకు విశాఖలో డాల్ఫిన్ హోటల్ ఉంది. పక్కనే జ్యోతి థియేటర్ డి.రామానాయుడుకు చెందినది.ఇక చాలావరకూ ఫైవ్ స్టార్ హోటళ్లు కమ్మ ప్రముఖులవేనని తెలుస్తోంది. ఇక ఉక్కు నగరం, నావల్ డాక్ యార్డు, పోర్టులో కీలక కాంట్రాక్ట్ ప్రాజెక్టులు సైతం ఆ సామాజికవర్గానికి చెందిన వారివే ఉన్నాయి. తాజాగా రెడ్డి సామాజికవర్గం వారు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నా.. కమ్మ సామాజికవర్గం స్థాయిలో జరిగేనా అన్న ప్రశ్నఅ యితే ఉత్పన్నమవుతోంది.
Also Read: Vaishnav Tej: సినిమాపై ఏమాత్రం హైప్ లేదు… మెగా హీరో వైష్ణవ్ పరిస్థితేంటి?
ఆ మూడు హార్ట్ ఆఫ్ సిటీ..
రామోజీరావుకు చెందిన డాల్ఫిన్ హోటల్, డి.రామానాయుడుకు చెందిన జ్యోతి థియేటర్, ఆ పక్కనే ఊటి హోటల్ అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి చేతిలో ఉండేది. ఈ మూడు హార్ట్ ఆఫ్ సిటీగా ఉన్నాయి. అయితే ఇప్పడు జ్యోతి థియేటర్ వేరే యాజమాన్యంలోకి వెళ్లింది. దగ్గుబాటి కుటుంబీకులు ఆ థియేటర్ ను విజయనగరానికి చెందిన వ్యక్తులకు రూ.35 కోట్లకు విక్రయించారు. థియేటర్ వ్యాపారం లాభసాటిగా లేదనో.. లేక సరైన ధర వచ్చిందనో తెలియదు కానీ..దగ్గుబాటి సురేష్ బాబు థియేటర్ ను అమ్మేశారు. రామోజీరావుకు మంచి ‘దారి’ చూపారు. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న ప్రయత్నానికి ఇతోధికంగా సాయమందించారు.
ఎట్టకేలకు రామోజీ చేతికి..
డాల్ఫిన్ హోటల్ పక్కనే ఊటీ హోటల్ ఉండేది. మంచి వ్యాపారమే జరిగేది. కానీ రామోజీరావు ఒత్తిడో..లేక ఏ ఇతర కారణాలతో కానీ ఊటీ హెటల్ ను సంబంధిత వ్యక్తి రామోజీరావుకు విక్రయించాడు. అలాగే జ్యోతి థియేటర్ కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఆధీనంలో ఉండేది. దానిని కూడా దక్కించేందుకు రామోజీరావు అప్పట్లో పావులు కదిపినట్టు తెలుస్తోంది. అయితే సదరు వ్యక్తి రామోజీరావుకు ఇవ్వకుండా..డి.రామానాయుడుకు విక్రయించారు. రామోజీరావుకు అమ్మడం ఇష్టం లేకే డి.రామానాయుడుకు ఏరికోరి ఇచ్చారన్న ప్రచారం అప్పట్లో ఉండేది. ఊటి హోటల్ ను అయితే దక్కించుకున్న రామోజీరావు దానిని డాల్ఫిన్ హోటల్ లో కలిపేందుకు మాత్రం చిన్నపాటి రహదారి అడ్డంకిగా మారింది. ఇది కానీ రామోజీరావు ఆధీనంలోకి వస్తే రెండు హోటల్ కలిసిపోయేవి. కానీ జ్యోతి థియేటర్ ముందున్న యాజమాన్యం ఆ రోడ్డును ఇవ్వలేదు. డి.రామానాయుడు ఆధీనంలోకి వచ్చిన తరువాత కూడా ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అలాగని జ్యోతి థియేటర్ కు మరో మార్గంలో రహదారి ఉన్నా..వాస్తు..ఇతరత్రా కారణాల రీత్యా రామోజీరావుకు విక్రయించలేదు. అయితే ఇటీవల జ్యోతి థియేటర్ ను విజయనగరం వారికి రూ.35 కోట్లకు విక్రయించినట్టు సమాచారం. దీంతో వారు చిన్నపాటి రహదారిని రూ.5 కోట్లకు రామోజీరావుకు విక్రయించినట్టు తెలుస్తోంది. అంటే వారికి జ్యోతి థియేటర్ రూ.30 కోట్లకు గిట్టబాటయ్యిందన్న మాట. రామోజీరావుకు సొంత సామాజికవర్గం వారు మొండిచేయి చూపారన్న మాట.
Also Read:Rohit Sharma- Kohli: కోవిడ్ తర్వాత కోహ్లీ మానసిక ఆరోగ్యంపై రోహిత్ శర్మ హాట్ కామెంట్స్