Vaishnav Tej: యంగ్ హీరో వైష్ణవ్ నటించిన రంగ రంగ వైభవంగా చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ మూవీ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు. ఓ మెగా హీరో సినిమాకు ఈ పరిస్థితి ఊహించనిదే. ఉప్పెన మూవీతో సంచలనం నమోదు చేశాడు వైష్ణవ్. డెబ్యూ మూవీతోనే రికార్డ్స్ కొల్లగొట్టాడు. 2021లో విడుదలైన ఉప్పెన వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ మూవీతో దర్శకుడు బుచ్చి బాబు, హీరోయిన్ కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి మరో స్టార్ దిగాడని ఫ్యాన్స్ సంబరపడ్డారు.
అయితే సెకండ్ సినిమాతో వైష్ణవ్ డిజాస్టర్ అందుకున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ సైలెంట్ గా కొండపొలం మూవీ తెరకెక్కించి విడుదల చేశారు. ఓ నవల ఆధారంగా తెరకెక్కిన కొండపొలం పూర్తిగా నిరాశపరిచింది. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో అచొచ్చిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు.
Also Read: Anasuya: ఆంటీ అంటున్న వాళ్లకు ఘాటైన అందాలతో అనసూయ సమాధానం… నడుము చూపిస్తూ టెంప్ట్ చేస్తూ రచ్చ
సెప్టెంబర్ 2న రంగ రంగ వైభవంగా విడుదల కానుంది. అయినప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకున్న నాథుడే లేడు. ఒక మెగా హీరో సినిమాకు ఏమాత్రం బజ్ క్రియేట్ కాకపోవడం నిజంగా ఊహించని పరిణామం. మెగా ఫ్యామిలీలోని స్టార్స్ కూడా ఈ మూవీ గురించి మాట్లాడింది లేదు. అలాగే ప్రమోషన్స్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా రంగ రంగ వైభవంగా బజ్ కోల్పోయింది. మిగిలిన ఈ కాస్త సమయాన్నైనా ఉపయోగించుకొని సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళితే మంచి ఫలితం దక్కవచ్చు.
ఇక సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఎవరూ ఆపలేరు. ఈ మధ్య కాలంలో క్యాస్ట్ తో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న చిత్రాలు సంచలనాలు చేస్తున్నాయి. అయితే ఇలాంటి చిన్న చిత్రాలను మంచిగా ప్రమోట్ చేయకుంటే ఓపెనింగ్స్ కోల్పోతాయి. కాగా రంగ రంగ వైభవంగా చిత్రాన్ని గిరీశాయ తెరకెక్కిస్తుండగా, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్, లక్ష్య చిత్రాల్లో నటించిన కేతిక శర్మ హీరోయిన్. ఆమెకు ఈ చిత్ర విజయం చాలా కీలకం. ఇది పరాజయంపాలైతే అవకాశాలు కష్టమే.
Also Read:Sharwanand: అమ్మో శర్వానంద్ అంత పెద్ద కోటీశ్వరుడా…హైదరాబాద్ లో మూడో వంతు తనదే ప్రతి ఏరియాలో స్థలం!