Harish Shankar: టాలీవుడ్ దర్శకుల్లో అత్యంత అగ్రెసివ్ గా ఉండే వారిలో ‘హరీష్ శంకర్’ ఒకరు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తీసిన ఈ డైరెక్టర్ అనంతరం వాల్మీకి మూవీని తీసి మెప్పించారు. మధ్యలో కొన్ని తీసి యావరేజ్ హిట్ ఇచ్చాడు. చాలా కాన్ఫిడెంట్ గా.. అగ్రెసివ్గా కనిపించే దర్శకుడు ఈయన. పెద్ద డిజాస్టర్ తీసినా కూడా మానసిక స్థైర్యం కోల్పోకుండా గట్టిగా నిలబడే దర్శకుడు ఈయన.
ఇక సోషల్ మీడియాలో ఎవరైనా ట్రోల్స్ చేస్తే వారి తాట తీసి నిలబెడతాడు. హీరోల తరుఫున నిలబడి గట్టిగా నిలబడుతాడు. అలాంటి హరీష్ శంకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల తన కెరీన్ ను నాశనం చేసుకుంటున్నాడని బయట టాక్. ఒక హీరో కోసం ఏడాది ఆగవచ్చు.. రెండేళ్లు ఆగవచ్చు. వాళ్లు సినిమా చేస్తానంటే ఆ ఆగడంలో అర్థం ఉంది. కానీ హరీష్ శంకర్ తో సినిమా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల వల్ల వీరి సినిమా ఎప్పుడు పూర్తవుతుందన్న క్లారిటీ రావడం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనేది ముందుకు సాగడం లేదు. ఇప్పటికే పవన్ ఒప్పుకున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా పూర్తికాలేదు. దీంతో హరీష్ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది.
Also Read: Ramoji Rao: ఆ చిన్న రహదారి కోసం.. నాలుగు దశాబ్దాల పాటు రామోజీరావు ఆరాటం
ఇండస్ట్రీలో క్రేజ్ ఉండగానే నాలుగైదు మంచి సినిమాలు తీసి ఆర్థికంగా స్థిరపడాలి. అందరు దర్శకులు చేసేది అదే. కానీ హిట్స్ ఇచ్చినా కూడా హరీశ్ శంకర్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పవన్ కళ్యాణ్ తో సినిమా ఒప్పుకోవడంతో అది వదిలేసి వేరే సినిమాకు హరీష్ వెళ్లలేని పరిస్థితి. అలా అని పవన్ తో పూర్తి చేయలేని పరిస్థితులు. పవన్ రాజకీయాల్లో యాక్టివ్ కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది.. దీంతో హరీశ్ శంకర్ ఖాళీగా ఉండాల్సి వస్తోంది. క
గద్దలకొండ గణేష్ లాంటి భారీ హిట్ తర్వాత కూడా పవన్ కోసం హరీశ్ శంకర్ ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేస్తుండడం అతడి సహనానికి పరీక్షగా మారింది..పవన్ కళ్యాణ్ ఎన్నేళ్లు అయినా సరే ఆగుతానని హరీష్ అంటున్నాడు. తన కథ, ఫేవరెట్ హీరో కోసం ఆగడంలో తప్పు లేదు అంటున్నాడు.
Also Read:Rohit Sharma- Kohli: కోవిడ్ తర్వాత కోహ్లీ మానసిక ఆరోగ్యంపై రోహిత్ శర్మ హాట్ కామెంట్స్