![]()
women bath : అవి వేడినీటి బుగ్గలు. వారాంతాల్లో సేదతీరడానికి మహిళలు అక్కడ స్నానం చేస్తారు. అక్కడికి మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది. పురుషులకు ప్రవేశం ఉండదు. కనుచూపుమేర వరకు మగపురుగును అడుగు పెట్టనివ్వరు. భద్రతాసిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ మహిళల నగ్న ఫోటోలు వెబ్ సైట్లలో దర్శనమిచ్చాయి. ఇదంతా చూసి పోలీసులే నిర్ఘాంతపోయారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో ? ఆ వేడినీటి బుగ్గల కథేంటో తెలుసుకోండి.
షిజుఒక.. జపాన్ రాజధాని టోక్యో నగరానికి సమీపంలో ఉంటుంది. ఇదొక పర్యాటక ప్రాంతం. సహజసిద్ధంగా ఏర్పడ్డ వేడినీటి బుగ్గలు ఇక్కడ ఉన్నాయి. టోక్యో నగర మహిళలు వారాంతాల్లో సేదతీరడానికి షిజుఒకలోని వేడినీటి బుగ్గల వద్దకు వస్తారు. అక్కడ స్నానం చేస్తారు. ఈ ప్రాంతంలో పురుషులకు అనుమతి ఉండదు. దీంతో పెద్ద ఎత్తున మహిళలు, అమ్మాయిలు ఇక్కడికి వస్తారు. వేడినీటి బుగ్గల్లో స్నానం చేస్తారు. కానీ ఇక్కడ స్నానం చేస్తున్న మహిళల ఫోటోలు వివిధ వెబ్ సైట్లలో వెలుగులోకి వచ్చాయి. వీటిని చూసి పోలీసులే నిర్ఘాంతపోయారు. ఎందుకంటే షిజుఒక వేడినీటి బుగ్గల సమీపంలోకి పురుషులను అనుమతించరు. కనుచూపుమేరలో మగవారే ఉండరు. కానీ నగ్న ఫోటోలు బయటికొచ్చాయి.
పోలీసుల కన్నుగప్పి ఓ ముఠా 30 ఏళ్ల నుంచి మహిళ నగ్న ఫోటోలు తీస్తోంది. ఈ ముఠాలో కనీసం 16 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వేడినీటి బుగ్గలకు సమీపంలోని కొండల్లో అధునాతన టెలిస్కోపిక్ లెన్స్ ఉన్న కెమెరాలను ముఠా సభ్యులు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా మహిళ నగ్న ఫోటోలు చిత్రీకరించారు. వాటిని వివిధ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేశారు. 30 ఏళ్లుగా ఇదే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10 వేల మంది మహిళల నగ్న ఫోటోలు చిత్రీకరించినట్టు తెలుస్తోంది. వీటిని వివిధ వెబ్ సైట్లకు విక్రయించారు.
కరినో సైటో అనే వ్యక్తి ఈ వ్యవహారానికి మూలమని పోలీసులు గుర్తించారు. అతడితో పాటు మిగిలిన ముఠా సభ్యులను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అప్ లోడ్ చేసిన వెబ్ సైట్ల నుంచి ఫోటోలను తొలగించారు. ఇన్నేళ్లుగా పోలీసుల కన్నుగప్పి ఫోటోలు తీస్తూ.. వాటిని వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయడమంటే మామూలు విషయం కాదు. పోలీసుల నిర్లక్ష్యానికి అదొక ఉదాహరణగా చెప్పవచ్చు. మహిళలకు భద్రత కల్పించడంలో టోక్యో పోలీసులు విఫలమయ్యారని చెప్పవచ్చు.