https://oktelugu.com/

కేసీఆర్ 10వేల సాయం.. పోటెత్తిన జనం

వరదలు వచ్చాయి.. పోయాయి.. వరద సాయం మాత్రం హైదరాబాదీలకు దక్కలేదు. కొందరు టీఆర్ఎస్ నేతల చిలక్కొట్టుడు వ్యవహారాల నేపథ్యంలో ప్రభుత్వం పరిహారం పంచడాన్ని వాయిదా వేసి మీసేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకుంటే డైరెక్ట్ గా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. Also Read: టీఆర్ఎస్ లో మేయర్ పీఠం ఆశావహులు వీరే.. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఈ ఆఫర్ ను వరద బాధితులు ‘క్యాష్’ చేసుకునేందుకు క్యూ కట్టారు. ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2020 / 12:40 PM IST
    Follow us on

    వరదలు వచ్చాయి.. పోయాయి.. వరద సాయం మాత్రం హైదరాబాదీలకు దక్కలేదు. కొందరు టీఆర్ఎస్ నేతల చిలక్కొట్టుడు వ్యవహారాల నేపథ్యంలో ప్రభుత్వం పరిహారం పంచడాన్ని వాయిదా వేసి మీసేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకుంటే డైరెక్ట్ గా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.

    Also Read: టీఆర్ఎస్ లో మేయర్ పీఠం ఆశావహులు వీరే..

    జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఈ ఆఫర్ ను వరద బాధితులు ‘క్యాష్’ చేసుకునేందుకు క్యూ కట్టారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా రూ.10వేల ఆర్థికసాయం కోసం మీసేవా కేంద్రాల వద్ద కిలోమీటర్ల కొద్ది బారులు తీరిన హైదరాబాద్ జనాలే కనిపిస్తున్నారు. ఇదో జాతరను తలపిస్తోంది.

    మంగళవారం ఇదే జాతర కొనసాగగా.. బుధవారం మరింత ఎక్కువైంది. మీ సేవా కేంద్రాలకు భారీగా జనాలు తరలివచ్చారు. చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామున 4 గంటల నుంచే బారులు తీరారు.

    Also Read: కేసీఆర్ టాప్ సీక్రెట్ మీటింగ్.. కథేంటి?

    నగరంలోని అన్ని కాలనీల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మీసేవా కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకున్న మరుసటి రోజునే నగదు వారి ఖాతాల్లో జమ అవుతోందన్న సమాచారంతో బాధితులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండడంతో సర్కార్ ఈ 10వేల సాయం చేస్తుండగా.. జనాలు వీటిని దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్