చిత్రసీమలో కమిట్ మెంట్.. కాంప్రమైజ్ అనే మాటలు సర్వసాధారణంగా విన్పిస్తుంటాయి. మీటూ ఉద్యమం వల్ల కాంప్రమైజ్.. కమిట్ మెంట్ అంటే ఏంటో అందరికీ తెల్సిపోయింది. అయితే మహిళలపై వేధింపులు ఒక్క సినిమా రంగానికే పరిమితం కాలేదని అన్నిరంగాల్లో ఉందని చూపించడానికే ‘కమిట్ మెంట్’ మూవీ తెరకెక్కించినట్లుగా కన్పిస్తోంది.
Also Read: ఆ హీరో భార్యకు తాప్సీ నచ్చలేదంట.. ఆ తర్వాత ఏమైంది?
ఆడవాళ్లు కన్పిస్తే మృగాళ్లు ఎలా ఆలోచిస్తారనే కోణంలో దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా ‘కమిట్ మెంట్’ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. బర్నింగ్.. కరెంట్ ఇష్యూలను బేస్ చేసుకొని దర్శకుడు స్ర్కీన్ ప్లే రాసుకున్నట్లు తెలుస్తోంది. ఎంతో ఎమోషన్.. బోలెడంత కంటెంట్ ఉన్న ఈ మూవీ నలుగురు అమ్మాయిల చుట్టే ప్రధానంగా తిరగనుందని తెలుస్తోంది.
దర్శకుడు లక్ష్మీ కాంత్ ‘కమిట్ మెంట్’ ట్రైలర్లోనే బోల్డ్ సీన్స్.. ఎమోషన్ డైలాగ్స్ చూపించి ఆకట్టుకున్నాడు. ఈ ట్రైలర్లోని ప్రతీఒక్క డైలాగ్ ప్రతీఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. ఆడది కనిపిస్తే మృగాళ్లు ఇంతేనా? కాంప్రమైజ్ అవ్వాలి.. లేదంటే కమిట్ మెంట్ ఇవ్వాలి? ఇంతేనా.. ఇంకేదీ ఆలోచించరా? అంటూ తేజస్వీ చెప్పిన డైలాగ్ సినిమా ఏ రేంజులో ఉంటుందో చెప్పేసింది.
Also Read: బిగ్ బాస్-4: రీ ఎంట్రీకి సిద్ధమైన కంటెస్టంట్ ఎవరంటే?
లైఫ్ పుట్టేది సెక్స్ వల్ల అయినప్పుడు లైఫ్ ఇవ్వడానికి సెక్స్ అడిగితే తప్పేంటీ? అనే డైలాగ్ అమ్మాయిలను ఎంత సింపుల్ గా మృగాళ్లు కాంప్రమైజ్ ఒప్పిస్తారనేది తెలియజేస్తోంది. వేధింపులనేది ఒక సినిమా రంగానికే పరిమితం కాలేదని చూపించడానికి టీజర్లో డాక్టర్ల కమిట్ సీన్స్ చూపించారు. బోలెడంత బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ‘కమిట్ మెంట్’ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఓ రేంజులో హీటిక్కెస్తున్న కమిట్ మెంట్ ట్రైలర్.. సినిమాపై అంచనాలను పెంచుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్