లెక్కలివీ: టీఆర్ఎస్ కే మేయర్ పీఠం?

హైదారాబాద్ లో  గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికల కోలాహాలం మొదలైంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా  టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన పార్టీలో పోటీలో ఉన్నాయి. టీఆర్ఎస్ ఎంఐఎం మినహా అన్ని పార్టీలో ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే ఏ పార్టీ అయినా మేజిక్ ఫిగర్ ఓట్లు సాధించాలి. అయితే 150 డివిజన్లలో కనీసం 70 సీట్లలో గెలుపొందాలి. కానీ టీఆర్ఎస్ కు ఆ శ్రమ అక్కర్లేదు. మేజిక్ ఫిగర్ కంటే తక్కువ […]

Written By: NARESH, Updated On : November 18, 2020 2:50 pm
Follow us on


హైదారాబాద్ లో  గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికల కోలాహాలం మొదలైంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా  టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన పార్టీలో పోటీలో ఉన్నాయి. టీఆర్ఎస్ ఎంఐఎం మినహా అన్ని పార్టీలో ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే ఏ పార్టీ అయినా మేజిక్ ఫిగర్ ఓట్లు సాధించాలి. అయితే 150 డివిజన్లలో కనీసం 70 సీట్లలో గెలుపొందాలి. కానీ టీఆర్ఎస్ కు ఆ శ్రమ అక్కర్లేదు. మేజిక్ ఫిగర్ కంటే తక్కువ అంటే 30 స్థానాల్లో గెలుపొందినా గూలాబీ సైన్యానికే మేయర్ పీఠం దక్కుతుంది. అదెలాగో చూడండి..

Also Read: కేసీఆర్ టాప్ సీక్రెట్ మీటింగ్.. కథేంటి?

హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. అలాగే ఎక్ష్ అఫిషియో ఓట్లు 60 ఉన్నాయి. మొత్తంగా కార్పొరేటర్లు, ఎక్ష్ అఫిషియో మెంబర్స్ కలిసి మేయర్ ను ఎన్నుకోవాలి. మొత్తం 210 ఓట్లలో మేయర్ పీఠం దక్కాలంటే  మేజిక్ ఫిగర్ 106 అయ్యే అవకాశం ఉంది.  టీఆర్ఎస్ కు ప్రస్తుతం ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు కలిసి మొత్తం  35 ఎక్ష్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. ఒక ఎప్పటి నుంచో పొత్తుతో ఉన్న ఎంఐఎం పార్టీ 30కి పైగా స్థానాల్లో గెలిచే అవకాశం ఎలాగూ ఉంది. దీంతో ఇప్పటికే 65 వరకు సీట్లు ఎటూ పోవు. ఇక మరో 30 నుంచి 40 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిస్తే సరిపోతుంది.  ఒకవేళ మేజిక్ ఫిగర్ 106 గా ఉంటే మేయర్ పీఠం టీఆర్ఎస్ దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

Also Read: టీఆర్ఎస్ లో మేయర్ పీఠం ఆశావహులు వీరే..

బీజేపీకి ఎక్ష్ అఫిషియో ఓట్లు తక్కువ. పైగా ఒంటరిగా పోటీలో నిలబడుతోంది. హైదరాబాద్ లో  ఎక్కువగా ముస్లిం ఆధారిత ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో అక్కడి ఓట్లు బీజేపీకి వచ్చే అవకాశం లేదు. మిగతా కొన్నిచోట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బలంగా ఉండడంతో అక్కడా బీజేపీకి కష్టమే కావచ్చు. దీంతో బీజేపీకి మేయర్ స్థానం దక్కాలంటే 100కు పైగా సీట్లలో గెలుపొందాలి.  ఇక కాంగ్రెస్ మేయర్ పీఠం మాటెత్తడం లేదు. గౌరవప్రదమైన గెలుపు ఉంటే చాలని ముందునుంచే ప్రచారం చేస్తోంది.

2016 ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ 106 గా ఉంది. ఆ ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలు, 24 మంది ఎమ్మెల్సీలు, 11 మంది రాజ్యసభ  సభ్యులు, ఐదుగురు లోక్ సభ సభ్యులు కలిసి మేయర్ పీఠం కోసం ఓటేశారు. దీంతో టీఆర్ఎస్ కే మేయర్ పీఠం దక్కింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్