Bipin Rawat helicopter crash: తమిళనాడులోని కూనూరులో ఆర్మీ హెలికాప్టర్ కూలిన దుర్ఘటనలో 13 మంది దుర్మరణం చెందడం తెలిసిందే. ఇందులో సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ తదితరులు ప్రమాదంలో మృతి చెందారు. మరో ఐదు నిమిషాల్లో గమ్యం చేరాల్సిన సమయంలోనే హెలికాప్టర్ కుప్పకూలడంతో పెను ప్రమాదం సంభవించింది. ప్రమాదాన్ని ప్రత్యక్ష్యంగా చూసిన ఓ వ్యక్తి వివరాలు వెల్లడించాడు. హెలికాప్టర్ కూలిపోయే దృశ్యాన్ని ప్రత్యక్ష్యంగా చూసి భయాందోళన చెందాడు.
హెలికాప్టర్ గాల్లో మంటల్లో చిక్కుకోవడంతో ఆ ప్రాంతమంతా మంటలు చెలరేగాయి. పెద్ద శబ్ధం వినిపించడంతో అటు వైపు చూడగా హెలికాప్టర్ గాల్లో చక్కర్లు కొడుతూ కింద పడింది. దీంతో అందులోని వారంతా అగ్నికి ఆహుతయ్యారు. అడవిలో పడిపోవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆలస్యమైంది. హెలికాప్టర్ మంటల్లో చిక్కుకుని పల్టీలు కొట్టడం చూస్తుంటే భయం నెలకొంది.
హెలికాప్టర్ కింద పడుతున్న క్రమంలో అందులో నుంచి ఓ వ్యక్తి కాలిపోతుండడం కనబడింది. కాలిపోతున్న వ్యక్తి మంటల్లో కాలుతుండగా కిందకు దిగాలని ప్రయత్నించినా రాలేకపోయి చివరికి కాలిపోయాడు. దీంతో అక్కడ నుంచి వెళ్లిన ప్రత్యక్ష సాక్షి సంఘటన గురించి మరో వ్యక్తికి చెప్పడంతో అతడు అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సహాయక చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది.
Also Read: Bipin Rawat: హెలిక్యాప్టర్ ప్రమాదంలో భారత ఆర్మీ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కన్నుమూత
హెలికాప్టర్ కూలిన ప్రదేశం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అధికారులు చేరుకోవడానికి ఆలస్యమైంది. హెలికాప్టర్ చేరుకునే సమయం దాటిపోవడంతో అధికారులు వేచి చూసినా హెలికాప్టర్ చేరకపోవడంతో ప్రమాదం విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. హెలికాప్టర్ ప్రమాదంతో దేశం యావత్తు ఆందోళనలో మునిగిపోయింది. అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read: Flight Accident: ఫైట్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న సినీ ప్రముఖులు వీరే?