RGV: అయితేనేం.. ఆర్జీవీ ఎప్పటికీ వాస్తవ జీవినే..

RGV:  రామ్ గోపాల్ వర్మ పై అభిప్రాయం ఏమిటి ? అని ఓ హీరోని అడిగారు. ఆ హీరోగారు ఆర్జీవీ ఓ వింత జీవి అని చెప్పాడు. అయినా ఆర్జీవీ అంటేనే వింత. ఆర్జీవీ ఆలోచనా విధానమే డిఫరెంట్. అయితే, ఆర్జీవీ పిచ్చోడు అని తేల్చి పారేయలేం. ఆర్జీవీ ఏమి మాట్లాడినా.. అందులో ఎంతో లోతు ఉంటుంది. పైగా తన ఆలోచనలను చాలా గొప్పగా వివరిస్తాడు ఆర్జీవీ. నిజంగానే ఒక సినిమా దర్శకుడిగా అంత లోతైన ఆలోచన […]

Written By: Shiva, Updated On : December 9, 2021 11:28 am
Follow us on

RGV:  రామ్ గోపాల్ వర్మ పై అభిప్రాయం ఏమిటి ? అని ఓ హీరోని అడిగారు. ఆ హీరోగారు ఆర్జీవీ ఓ వింత జీవి అని చెప్పాడు. అయినా ఆర్జీవీ అంటేనే వింత. ఆర్జీవీ ఆలోచనా విధానమే డిఫరెంట్. అయితే, ఆర్జీవీ పిచ్చోడు అని తేల్చి పారేయలేం. ఆర్జీవీ ఏమి మాట్లాడినా.. అందులో ఎంతో లోతు ఉంటుంది. పైగా తన ఆలోచనలను చాలా గొప్పగా వివరిస్తాడు ఆర్జీవీ. నిజంగానే ఒక సినిమా దర్శకుడిగా అంత లోతైన ఆలోచన బహుశా మరో ఏ దర్శకుడికి ఉండదు.

RGV

ఏ టాపిక్ తీసుకున్నా.. దాన్ని ఎన్నో రకాలుగా చర్చించి, వివరించి చెబుతాడు. అసలు ఒక మనిషి ఇన్ని రకాలుగా ఆలోచించొచ్చా అని మనకనిపిస్తుంది. ఇప్పటివరకు రాముయిజంలో వచ్చిన ప్రతి ఎపిసోడ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ చెప్పే విధానం వేరు అయ్యుండొచ్చు, కానీ చెప్పేది మాత్రం నగ్నసత్యం.

ఆర్జీవీ మాట్లాడేది ప్రతి ఒక్కటి ఎంతో నిజాయితీగా ఉంటుంది. చాలామంది లోపల ఎంతో తగని ఆలోచనలు చేసినా కూడా, పైకి మాత్రం మహానుభావులు గా నటిస్తారు. కానీ వర్మ అలా కాదు. చాలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు చెబుతాడు. చెప్పే దాంట్లో ఏది తప్పు ఉండదు, కానీ చెప్పే విధానం చాలా కఠినంగా ఉంటుంది.

అందుకే ఆర్జీవీ వింత జీవి అయ్యాడు. వర్మ తన మాటలతో రెచ్చిపోతున్నాడని, తన చేష్టలతో మితిమీరిపోతున్నాడని.. అసలు వర్మ చేసే పనులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఇలా వర్మ పై నెటిజన్లు విరుచుపడతారు . కానీ వర్మలో రోజురోజుకు విపరీత ధోరణి పెరగడం లేదు, వాస్తవిక దృక్పథం పెరుగుతుంది.

Also Read: RRR Theatrical Trailer: వైల్డ్ టైగర్ తో యంగ్ టైగర్ పోరాడితే… మైండ్ బ్లాక్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ హైలెట్స్!

ఏది ఏమైనా ఎవరు ఏమనుకుంటారో అని వర్మ పట్టించుకోడు. పక్కోడి మాటలకు ఎదురింటోడు ఫీలింగ్స్ కు వర్మ విలువ ఇవ్వడు. అందుకే, ఆర్జీవీ అనే ఈ వింత జీవి ఏమి చేసినా సరి కొత్తగా ఉంటుంది. అయితే ఒకప్పుడు క్రియేటివిటీకి వర్మ మారు పేరు. ఇప్పుడు ప్రమోషన్స్ కి మాత్రమే పరిమితం అయిపోయిన సాధారణ దర్శకుడు. అయితేనేం.. ఆర్జీవీ ఎప్పటికీ వాస్తవ జీవినే.

Also Read: స్నానం చేస్తున్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్… రెండు నెలలు నిద్రపోలేదు

Tags